
పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా చూడట్లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. టిడిపితో పొత్తు ఏర్పాటు చేసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ పొత్తులపై కేంద్ర నాయకత్వంతో కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.
బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని, ఒప్పిస్తానని చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర పరిస్థితులను పవన్ తీసుకువెళతామన్నారని ఆమె గుర్తుచేశారు. దీనిపై కేంద్రం పెద్దలు తమతో చర్చలు చేసిన సమయంలో తమ అభిప్రాయాలు చెబుతామని పురందేశ్వరి వెల్లడించారు.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన విధానాన్ని మొదటగా మేమే వ్యతిరేకించామని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కి తాము వ్యతిరేకం అని మాజీ కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. జనసేన, బీజేపీతో ఇంకా పొత్తులోనే ఉందని పురందేశ్వరి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారని ఆమె పెర్కోన్నారు.
చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారం అని ఆమె తీవ్రంగా ఖండించారు. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుందని పురందేశ్వరి గుర్తు చేశారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని కోమల విలాస్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై స్పందించారు.
More Stories
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్
రాజధాని భూసేకరణను, సచివాలయాల వ్యవస్థను తప్పుపట్టిన కాగ్