జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్

అల్లు అర్జున్ జాతీయ  ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.  భారతీయ సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ మీడియా సెంటర్లో గురువారం  69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను జ్యూరీ సభ్యులు ప్రకటించారు.  ‘పుష్ప’ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌కు ఈ అవార్డు దక్కింది.
69 ఏండ్ల చరిత్రలో మొదటిసారి తెలుగు హీరోకు జాతీయ నటుడిగా అవార్డు లభించింది.  మొట్టమొదటి సారిగా  తెలుగు జాతీయ నటుడిగా పురస్కారం అందుకుని అల్లు అర్జున్ అరుదైన రికార్డు నమోదు చేశాడు.  2021 ఏడాదికిగాను  28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి.  ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ’ నిలిచింది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిలింగా అవార్డు దక్కింది.  తెలుగు సినిమాలు ఆర్ఆర్ఆర్, పుష్ప: ది రైజ్ ఈసారి జాతీయ అవార్డుల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డుల పంట పండింది.  ఉత్తమ నటి అవార్డును ఆలియా భట్, కృతి సనన్ పంచుకున్నారు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిలింగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని దక్కించుకుంది.

ఈ ఏడాది ‘జై భీమ్’, ‘మిన్నల్ మురళి’, ‘తలైవి’, ‘సర్దార్ ఉధమ్’, ‘83’, ‘పుష్ప: ది రైజ్’, ‘షేర్షా’, ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, ‘గంగుభాయి కతియావాడి’, ‘నాయట్టు’, ‘ఆర్ఆర్ఆర్’ తదితర చిత్రాలు పోటీలో నిలిచాయి.

ముఖ్యమైన జాతీయ అవార్డులు

బెస్ట్ యాక్టర్ – అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) – దేవీ శ్రీప్రసాద్ (పుష్ప: ది రైజ్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) – ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్)

బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – కాలభైరవ (ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో పాట)

బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ – కింగ్ సోలోమాన్ (ఆర్ఆర్ఆర్)

బెస్ట్ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్)

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – వీ శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)

బెస్ట్ లిరిక్స్ – చంద్రబోస్ (కొండపొలం – ధమ్ దమాధమ్)

బెస్ట్ నటి – అలియా భట్ (గంగూభాయ్ కఠియవాడి), కృతిసనన్ (మిమి)

బెస్ట్ తెలుగు సినిమా – ఉప్పెన

స్పెషల్ జ్యూరీ అవార్డ్ – విష్ణువర్ధన్ (షేర్ షా)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – షేర్షా

బెస్ట్ ఎడిటింగ్ – సంజయ్ లీలా భన్సాలీ (గంగూభాయ్ కఠియవాడి)

బెస్ట్ స్క్రీన్ ప్లే – షాహీ కబీర్ ( నయట్టు- మలయాళం)

బెస్ట్ అడాప్టివ్ స్క్రీన్ ప్లే: గంగూభాయ్ కఠియవాడి

బెస్ట్ డైలాగ్ రైటర్ – గంగూభాయ్ కఠియవాడి

బెస్ట్ సినిమాటోగ్రఫీ – అవిక్ ఉపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్)

బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రేయా ఘోషాల్ (ఇరవిన్ నిజాల్.. మాయావా చయావా)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – భవిన్ రబారీ (చెల్లో షో)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – పల్లవి జోషీ (కశ్మీర్ ఫైల్స్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ – మిమి (హిందీ)

బెస్ట్ ఫిల్మ్: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్