కర్నూలు, కరీంనగర్‌లలో ఎన్ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని కర్నూలుతో పాటు తెలంగాణలోని కరీంనగర్ ఈ సోదాలు చేస్తున్నారు. కర్నూలు ఓల్డ్ సిటీకి చెందిన అబ్దుల్లా, మావియా ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఇప్పటికే వీరిద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. కరీంగనగర్ జిల్లాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. 
 
పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. కరీంగనర్ లోని హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఓ కీలక నేత తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
కరీంనగర్ హుస్సేనీపురకు చెందిన తబరేజ్ కు గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉపాధి పొందతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్​ఐఏ అధికారుల బృందం అతని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కరీంనగర్ కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెల్లవారు జామునే కరీంనగర్ చేరుకున్న టీమ్ ఎన్‌ఐఏ డీఎస్పీ రాజేష్ ఆధ్వర్యంలో అనుమానిత వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. అధికారులు తనిఖీలు చేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధిత సంస్థ లింకులను అధికారులు గుర్తించారు. ఇక నగరంలోని పలు కాలనీల్లో కూడా ఎన్ఐఏ సోదాలు చేపట్టారు. గతంలోనూ ఇదే సంస్థకు చెందిన పలువురుపై ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. 
 
పీఎఫ్‌ఐ లింకులపై ఎన్‌ఐఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుపాదం మోపింది. గతేడాది సెప్టెంబర్‌లో సోదాలు చేసింది. నిజామాబాద్, నిర్మల్‌, జగిత్యాలతోపాటు ఏపీలోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. గతంలో చేపట్టిన సోదాల సమయంలో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్స్‌ ను స్వాధీనం చేసుకుంది ఎన్‌ఐఏ. 
 
తాజాగా మరోసారి సోదాలు చేపట్టడంతో… కరీంనగర్‌లో పీఎఫ్‌ఐ కదలికలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే…. కరీంనగర్ తో పాటు కర్నూలులో ప్రధానంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.