
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఈ దేశంలోని గిరిజనులకు, దళితులకు సమాజంలో అన్ని రంగాల్లో ప్రాధాన్యతను ఇవ్వడమే కాక అత్యున్నతంగా గౌరవించి వారిని అన్ని రంగాలలో సత్కరించిందని కేంద్ర ప్రసార, పశుసంవర్ధక శాఖ మంత్రి మురుగన్ తెలిపారు.
ఆదివారం అచ్చంపేట పట్టణంలో బీజేపీ పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆదివాసి గిరిజన మహిళలకు ఈ దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతి పదవినిచ్చి వారిని అత్యున్నతంగా గౌరవించిన ఘనత ప్రధానమంత్రి మోదీకి దక్కుతుందని తెలిపారు.
ప్రధానమంత్రి మోదీని మూడోసారి కూడా ప్రధానమంత్రిగా గెలిపించేందుకు నాగర్ కర్నూల్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధికి నోచుకోని ఎస్సీ ఎస్టీలకు బీజేపీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ఇదే సమావేశంలో పేర్కొన్నారు. 30 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీలే శ్వాసగా జీవించానని చెప్పారు.
తన వారసుడిగా విద్యావంతుడైన తన కొడుకు భరత్ ను మీ సేవకై తీసుకొస్తున్నానని, కమల పువ్వు గుర్తుపై ఓటు వేసి బ్రతుకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి మోదీ మూడోసారిగా ప్రధానమంత్రి అయ్యేలా దీవించాలని గిరిజనులను ఉద్దేశించి ఆయన కోరారు. గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ నాయక్, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ కూడా పాల్గొన్నారు.
More Stories
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్
కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచే ముప్పు
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం