ఈ కార్యక్రమంలో బిజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి చైర్మన్ ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర కల్పించడంలో, సమయానికి కొనుగోళ్లు పూర్తి చేయడంలో, ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని రాంచందర్ రావు మండిపడ్డారు. తాము పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కళ్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోందని, అధికారులు, మిల్లు యజమానుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు బిజెపి నాయకుల ప్రతినిధి బృందంతో చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.
రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రైతాంగ సమస్యల పరిష్కారానికి, ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని రాంచందర్ రావు రైతులకు భరోసా కల్పించారు.
అయితే బీజేపీ బృందం పర్యటిస్తుందనే సమాచారంతో నిన్న రాత్రికి రాత్రే ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడి రైతులను బెదిరించి, సంచులను నింపి, ఎట్లా పడితే అట్లా మిల్లర్ల వద్దకు తరలించిందని రామచందర్ రావు ధ్వజమెత్తారు.
More Stories
పేపర్ లీక్ పై గుణపాఠాలు నేర్చుకొని ఎన్టీఏ
రాజకీయాలు వినోదం కాదు, సినిమా లాంటి ప్రదర్శన కూడా కాదు
ట్రంప్ ఇరాన్ యుద్ధంలో ఓడిపోతున్నారా?