
కాగా.. ఆగస్టు 2వ తేదీన ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ మినరల్స్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ దౌత్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పెండింగ్‌లో ఉన్న తీవ్రమైన సమస్యల్ని పరిష్కరించేందుకు తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా భారత విదేశాంగ శాక పైవిధంగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
నిజానికి, పాకిస్తాన్‌తో భారత్ ఎప్పటినుంచో స్నేహపూర్వక సంబంధాల్ని కోరుకుంటూనే ఉంది. అలాంటి సంబంధం ఏర్పడాలంటే ఉగ్రవాదం, శతృత్వం లేని శాంతియుత వాతావరణాన్ని సృష్టించే బాధ్యత కూడా పాక్‌పై ఉందని స్పష్టం చేస్తుంది. అంతేకాదు జమ్మకశ్మీర్ ఎప్పుడూ భారత భూభాగమేనని, ఎప్పటికీ ఉంటుందని కూడా భారత్ చెప్తూ వస్తోంది. కానీ పాకిస్తానే తన తీరు మార్చుకోవడం లేదు.
More Stories
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!
విద్యార్థి వీసాపై పాక్ కు వెళ్లి శిక్షణ తీసుకున్న ఆదిల్ థోకర్!