చంపాపేట్ చౌరస్తాలో జీహాదీల దిష్టిబొమ్మ దగ్దం – రాస్తారోఖో   

హర్యానాలోని మేవాత్‌లో సోమవారం హిందువులపై జరిగిన దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ జాతీయ కమిటి ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలలో భాగంగా బుధవారం ఎల్ బి నగర్ లోని చంపాపేట్ చౌరస్తాలో రాస్తారోఖో  కార్యక్రమాన్ని నిర్వహించి జీహాదీల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్.రావినూతల శశిధర్ మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సోమవారం నాడు భక్తులు మేవాత్‌లోని మహాభారత కాలం నాటి ఐదు దేవాలయాలను సందర్శించి శంకర్ భగవంతుని ఆశీస్సులు పొందుతారని తెలిపారు. సోమవారం దాదాపు 25 వేల మంది హిందూ భక్తులు పాల్గొన్న యాత్రపై జీహాదీ శక్తులు బుల్లెట్లు గురిపెట్టడం, రాళ్లు విసరడం, వాహనాలు దహనం చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

పక్కా ప్రణాళికా ప్రకారం యాత్ర వెనుక నుంచి రాళ్ల వర్షం కురిపించి, భక్తులపై పెట్రోలు బాంబులు విసిరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వి హెచ్ పి కార్యకర్తలు కొంత మంది భక్తులను రక్షించి నల్హాద్ మహాదేవ్ ఆలయానికి తీసుకురాగలిగారని చెప్పారు. అయితే, ఆ గుడి ముందు నుంచి కూడా అల్లరి మూకలు దాడిచేశారని.  కార్లు, బస్సులు, ఇతర వాహనాలకు నిప్పుపెట్టి, ఎదురుగా ఎవరు కనిపించినా తూటాలు పేల్చారని వివరించారు. 
 
ఇద్దరికి బుల్లెట్లు గాయాలయ్యాయని, ఆ ప్రాంతంలోని దాదాపు అన్ని వాహనాలు దగ్ధమయ్యాయి లేదా ధ్వంసమయ్యాయని శశిధర్ చెప్పారు. పోలీసులు రావడంతో పోలీసులను చూసి దుండగులు పారిపోయి కొండలు ఎక్కి ఆలయంలో తలదాచుకున్న మహిళలు, చిన్నారులు, ఇతర భక్తులపై మూడు వైపుల నుంచి కాల్పులు జరిపగా అనేక మంది హిందువులు గాయపడటం జరిగిందని వివరించారు. 
 
మేవాత్ మొత్తం మినీ పాకిస్థాన్‌గా మారిందని పేర్కొంటూ దేవాలయాల పైన, పోలీసు ఔట్‌పోస్టులపై కూడా దాడులు చేశారని తెలిపారు. ఈ అల్లర్లను ప్రేరేపించిన  జీహాదీ వ్యక్తులే ఈ ఘటనకు బాధ్యులని, వారి ప్రోద్బలంతో శ్రీరామ నవమి రోజున  కూడా  ఈ ప్రాంతంలో దాడులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. 
 
క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసుట, భక్తులను రక్షించేందుకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు బలగాలు పంపాలని వి హెచ్ పి డిమాండ్ చేసిందని చెప్పారు. హర్యానా  లోని మేవత్, నోహ్‌లో డైరెక్ట్ యాక్షన్ తరహా వాతావరణం సృష్టించబడటం తీవ్రమైన ఆత్మపరిశీలనకు సందర్భమని, చిన్న పిల్లలకు కూడా దాడులు చేయడం, నిప్పు పెట్టడం లాంటి శిక్షణ ఇస్తున్న జీహాదీ శక్తులు ఎలాంటి భవిష్యత్తును సృష్టిస్తున్నారో దేశ ప్రజలు ఆలోచించాలని శశిధర్ హెచ్చరించారు. 
 
ఈ దుర్మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించలేది లేదని స్పష్టం చేస్తూ హిందూ సమాజానికి రక్షణగా వి హెచ్ పి నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ ఉగ్రదాడి కారణంగా బజరంగ్‌దళ్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలు దారుణంగా హత్యకు గురయ్యారని, సమాజంలోని మరో నలుగురు వ్యక్తులు కూడా బలి అయ్యారని ఆయన విచారం వ్యక్తం చేయసారు. 
 
వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కొంతమంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని చెబుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, రూ.20 లక్షలు ఇవ్వాలని, వాహనాలు, బస్సులు ధ్వంసమైన వారికి పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 
 
మేవాత్ ప్రాంతమంతా సీల్ చేసి, కూంబింగ్ చేయాలని ప్రతి జిహాదీని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ అప్పుడే మేవాత్‌లో జరుగుతున్న ఈ హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చని తెలిపారు.  జిల్లా సంఘటనా మంత్రి సాయి రామ్ , జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి , భజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ మహేశ్ , ప్రాంత సహ ప్రచార ప్రముఖ్ పీసపాటి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.