బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్

కొత్త జాతీయ కార్యవర్గ సభ్యులను బీజేపీ శనివారంనాడు ప్రకటించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జాతీయ స్థాయిలో టీమ్ బీజేపీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  నియమించారు. రాష్ట్ర ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి సీవీ రమణ్ సింగ్‌లతో పాటు తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డి కె అరుణలను తిరిగి ఉపాధ్యక్షులుగా నియమించారు.
 
తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. యూపీ నుంచి రాథామోహన్ అగర్వాల్, రాజస్థాన్ నుంచి సునీల్ బన్సాల్, మధ్యప్రదేశ్ నుంచి కైలాష్ విజయవర్గీయలకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో నియమించారు. 
 
మహారాష్ట్రకు చెందిన వినోద్ టావ్డే, పార్టీ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్న పంజక ముండేతో పాటు విజయ రహట్‌కర్‌లకు సైతం జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.  అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మాజీ వైస్-ఛాన్సలర్ తారిఖ్ మన్సూర్‌ (ప్రస్తుతం యూపీ బీజేపీ ఎమ్మెల్సీ)ను ఉపాధ్యక్షుడిగా నియమించారు.
 
అరుణ్ సింగ్, కైలాష్ విజయవర్గియ, దుశ్యంత్ కుమార్ గౌతమ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బి ఎల్ సంతోష్ (సంస్థాగతవ్యవహారాలు) ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షులలో ఐదుగురు, కార్యదర్శులతో నలుగురు మహిళలు ఉన్నారు. కాగా ఏపీ నుండి సత్యకుమార్ ను తిరిగి కార్యదర్శిగా నియమించారు. కాగా, ఉపాధ్యక్షురాలిగా ఉన్న డి పురందేశ్వరి ఇటీవలనే రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే.
 
మొత్తంగా 13 మంది ఉపాధ్యక్షులు, తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులు ఈ జాబితాలో ఉన్నారు. బీహార్ లోక్‌సభ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్‌ను పార్టీ ఉపాధ్యక్షుడి పదవి నుంచి తప్పించారు. ప్రముఖ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ తనయుడైన అనిల్ ఆంటోనికి జాతీయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక నేత సి టి రవి, అస్సాం ఎంపీ దిలీప్ సకియా లను ప్రధాన కార్యదర్శులుగా తొలగించారు.
ఉపాధ్యక్షులు: రమణ్ సింగ్, వసుంధరరాజే, రఘుబర్ దాస్, సౌదాన్ సింగ్, బైజాయంత్ జై పాండా, సరోజ్ పాండే, రేఖ వర్మ, డీకే అరుణ, సి చుబాహో, అబ్దుల్లా కుట్టి, లక్ష్మీకాంత్ బాజపాయి, లతా ఉసెండి, తారక్ మన్సూర్
 
ప్రధాన కార్యదర్శులు: అరుణ్ సింగ్, కైలాష్ విజయవర్గియ, దుశ్యంత్ కుమార్ గౌతమ్, తరుణ్ ఛుగ్,  వినోద్ టావ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, రాధా మోహన్ అగర్వాల్, బి ఎల్ సంతోష్. సంయుక్త ప్రధాన కార్యదర్శి: శివ ప్రకాష్
 
కార్యదర్శులు: విజయ్ రహత్కర్, సత్య కుమార్, అరవింద్ మీనన్, పంకజ్ ముందే, డా. నరేంద్ర సింగ్, అల్కా గుజర్, డా. అనుపమ జాజర. ఓంప్రకాష్  దుర్వ్, రితురాజ్ సిన్హా, ఆశ లక్రా, కామాఖ్యా ప్రసాద్ తాసా, సురేంద్ర సింగ్ నాగర్, అనిల్ ఆంటోనీ.
 
కోశాధికారి: రాజేష్ అగర్వాల్, సంయక్త కోశాధికారి: నరేష్ బన్సల్, కార్యాలయ కార్యదర్శి: మహేంద్ర కుమార్.