ఎబివిపిని దేశవ్యాప్త ఉద్యమమగా తీర్చిదిద్దిన మదన్ దాస్ దేవి

ఎబివిపిని దేశవ్యాప్త ఉద్యమమగా తీర్చిదిద్దిన మదన్ దాస్ దేవి
వినయ్ సహస్రబుద్ధే, ఎంపీ, 
అధ్యక్షుడు, భారత సాంస్కృతిక సంబంధాల మండలి,
బిజెపి మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు
 
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని కర్మల అనే ఒక మారుమూల పట్టణం నుండి వచ్చి వందలాది మంది ఇతరుల వలె ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా జీవితాంతం పనిచేసిన ఈ సీఎ, ఎల్‌ఎల్‌బి చదివిన ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారక్ మదన్ దాస్ దేవి అంత్యక్రియలను మూడు రోజుల క్రితం టీవీలలో చూస్తున్నవారు ఆశ్చర్యపోక తప్పదు.
 
సోషల్ మీడియాలో క్రియాశీలకంగా లేని, ప్రధాన స్రవంతి మీడియాలో పెద్దగా వినబడని, అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ లో దాదాపు క్రియారహితంగా ఉంటున్న ఈ వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనేక మంది వివిఐపిలు బారులు తీరేంత ముఖ్యమైన వ్యక్తిగా ఎలా పరిగణించబడతారో వారు ఆశ్చర్యపోయి ఉండవచ్చు.
 
మదన్ దాస్ దేవి పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్,  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి)ల కార్యకర్తల నుండి గొప్ప గౌరవాన్ని పొందారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భగవత్‌, హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు మంత్రులు, డజన్ల కొద్దీ బీజేపీ కార్యకర్తలు, జర్నలిస్టు రామ్‌ బహదూర్‌ రాయ్‌తో సహా పలువురు  నాయకులు హాజరు కావడం కార్యకర్తల హృదయాల్లో మదన్‌జీ సంపాదించుకున్న స్థానాన్ని చాటిచెప్పింది.
 
1942లో జన్మించిన మదన్ దాస్ ఏబీవీపీ తొలి సంఘటనా కార్యదర్శి. అనేక ఇతర విద్యార్థి సంస్థల వలె కాకుండా, ఎబివిపి చాలా కాలంగా కేవలం క్యాంపస్- కేంద్రీకృత విద్యార్థి సంఘం. విస్తృతమైన ఒక యువజన ఉద్యమంలో భాగంగా లాబొరేటరీ నుండి మరుగుదొడ్ల సమస్యలపై పనిచేస్తుంది.
 
వ్యక్తులతో కూడిన నెట్‌వర్క్‌ను అల్లడం దాని ప్రత్యేక శైలికి ధన్యవాదాలు. 75 ఏళ్ల సంస్థ నేడు ఆచరణాత్మకంగా ప్రజా జీవితంలోని అన్ని రంగాలలో భారీ ప్రభావాన్ని కలిగి ఉంది. అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రఖ్యాత న్యాయవాదులు, విద్యావేత్తలు, వైస్-ఛాన్సలర్లు, పాత్రికేయులు, మీడియా వ్యక్తులు తమ యవ్వనంలో ఎబివిపిలో  గడిపారు.
 
 “ప్రతి కార్యకర్తకు  సంస్థకు తన అవసరం ఉందనే భావాన్ని కలిగించాలి… తమ అవసరం ఉందని భావించినప్పుడు వ్యక్తులు సంస్థలో కొనసాగుతారు” అంటూ ఆయన సహచర కార్యకర్తలతో చెబుతుండేవారు. మదన్ జీ తన జీవితాంతం చాలా మంది మాజీ ఎబివిపి కార్యకర్తలతో సన్నిహితంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.
 
సంఘటనా కార్యదర్శి పదవి అంటే ప్రతిష్ట అంతగా ఉండదు,  బాధ్యతతో కూడుకొని ఉంటుంది. ఏ రాజ్యాంగ అధికారంతో సంబంధం లేకుండా, సంఘటనా కార్యదర్శికి నైతిక అధికారం చేకూరుతుంది. మదన్ దాస్ ఈ నైతిక అధికారాన్ని చాలా బాగా, ముఖ్యంగా అవసరానికి తగువిధంగా ఉపయోగించారు.  సంఘటనా కార్యదర్శి అన్నింటికంటే అతీతంగా ఎదగాలి, దేనితో అతుక్కుపోకుండా ఒక ఆదర్శంగా నిలబడాలి. 
 
అతను ప్రతి ఒక్కరినీ తన వెంట తీసుకెళ్తాడని, వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలకు పూర్తిగా దూరంగా ఉంటాడని,  ప్రతి ఒక్కరినీ సమదృష్టితో చూస్తాడని కూడా భావిస్తారు. మదన్ దాస్, చాలా మంది చెప్పి చేసినట్లుగా, కార్యకర్తలను ముందుగా వారి ప్రతిభతో పాటు, వారి పరిమితులను కూడా గుర్తించి మనుషులుగా పరిగణిస్తారు.
 
ఒక సంస్థకు, మరీ ముఖ్యంగా సంఘటనా కార్యదర్శికి, ప్రతి వ్యక్తికి కొంత ప్రతిభ ఉంటుందని గుర్తుంచుకొంటూ ఆ ప్రతిభ వెలుగులోకి వచ్చే విధంగా సహనంతో వ్యవహరించడం అవసరం.  ఇది మదన్ జీ విధానం. తన జీవితాంతం అనధికారికంగా రూపొందిన ఈ విధానానికి కట్టుబడి ఉండటమే కాకూండా, ఆర్ఎస్ఎస్, అనేక ఆర్ఎస్ఎస్-ప్రేరేపిత సంస్థలలో సర్వసాధారణంగా అనుసరించడంతో పాటు, పలు రేట్లు వికసించే విధంగా చూశారు.
 
ఈ సంస్థాగత సంఘటన శాస్త్రం ప్రాథమిక విషయాలపై రాజీపడకుండా, మదన్ దాస్ ఎబివిపిని దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అనేక దశాబ్దాలుగా అవిశ్రాంతంగా చేసిన ప్రయత్నాల కారణంగా ఎబివిపి నిజమైన ఒక అఖిల భారత సంస్థగా మారింది. 
 
1975 ఎమర్జెన్సీ సమయంలో, ఎబివిపిని నిషేధించబడనప్పటికీ, దానిలోని అనేక మంది నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు. పలు  ఆంక్షలు విధించడంతో సంస్థ నెట్‌వర్క్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ కాలంలో, మదన్ జీ మొదటిగా, కార్యకర్తల మనోబలం చెక్కుచెదరకుండా ఉండే విధంగా, మరోవంక, సంస్థ పని చేస్తూనే ఉండే విధంగా చూసుకున్నారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తల బృందంతో, వేలాది మంది ఎబివిపి కార్యకర్తలను సత్యాగ్రహం చేసేందుకు సమీకరించి, వారిని నెలల తరబడి కటకటాల వెనుక ఉండే విధంగా సిద్ధం చేశారు.
 
కొంతకాలం పాటు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల మధ్య సమన్వయ బాధ్యతలు కూడా మదన్‌దాస్‌ నిర్వహించారు. గత శతాబ్దపు చివరి దశాబ్దంలో, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మొదటిసారిగా ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ ప్రభుత్వ సారథ్యంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో, క్రమబద్ధీకరించడానికి చాలా సమస్యలు ఉన్నాయి. మదన్ దాస్ నిరంతర సమాలోచనలు, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వాటిని నేర్పుగా నిర్వహించారు. ముఖ్యంగా, అతను అందరూ ప్రముఖ బీజేపీ, ఎన్డీయే నాయకులతో కూడా అనధికారిక సంబంధాలను ఏర్పరచుకోగలిగారు.
 
మదన్ దాస్ ఏ సంస్థకైనా శాస్త్రీయమైన కార్యపద్ధతి ఉండాలని బలంగా కోరుకునేవారు. కాలపరీక్షకు నిలిచినా సంఘటనా శాస్త్రం – కార్య పద్ధతి మనకు భావజాలం మాదిరిగా మౌలిక మైనదని ఆయన సహచరులకు ఎల్లప్పుడూ గుర్తు చేసేవారు. భావజాలం కోసం ఎవ్వరు సంస్థాగత వ్యవస్థలను లేదా కార్య విధానాలను త్యాగం చేయరాదని అతని దృఢమైన నమ్మకం.
 
ఆర్ఎస్ఎస్ లో వికసించి, పరిణామం చెందిన ఆయన వంటి పలువురు సీనియర్ ప్రచారక్ లు అభివృద్ధి చేసిన బలమైన సంఘటనా శాస్త్రాన్ని మదన్ దాస్ వారసత్వంగా వదిలి వెళ్లారు.  ఒక వ్యక్తి ఒక సంస్థల్లోకి ముందుగా తనపట్ల ఏ విధంగా వ్యవహరిస్తారో అనే విషయమై ఆకర్షితులవుతారని, ఆ తర్వాతనే సైద్ధాంతిక భావం ఏర్పడుతుందని ఇతరుల మాదిరిగా ఆయన కూడా ప్రగాఢంగా విశ్వసించారు. ఒక నిబద్దత గల సంఘటనాకర్తగా వ్యక్తులలోని లోపాలను కూడా అంగీకరించి, తన బేషరతు ప్రేమద్వారా వారు తమ బలహీనతలను అధిగమించేందుకు సహాయం చేసేవారు.
 
ఆర్‌ఎస్‌ఎస్‌పై బుద్ధిహీనమైన రాజకీయ విమర్శలు చేసేవారు దాని సంఘటనా శాస్త్రాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. అనేక మంది ఈ సంఘటనా శాస్త్రాన్ని అనుసరించేవారు ఉన్నంత కాలం శతాబ్ది ఉత్సవాల ముందున్న ఈ సంస్థ ముందడుగు వేస్తూనే ఉంటుంది.
 
(ఇండియన్ ఎక్సప్రెస్ నుండి)