వాలంటీర్లపై వాఖ్యలకు ఏపీ ప్రభుత్వం కేసు … సై అంటున్న పవన్!

గ్రామ, వార్డు వలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను  ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పవన్ కల్యాణ్ పై చర్యలకు సిద్ధమైంది సర్కార్. 

 మహిళా వలంటీర్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.  క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ – 1973 ప్రకారం పవన్ కల్యాణ్ పై చర్యలకు సిద్ధమైంది ఏపీ సర్కార్. వలంటీర్లపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరుహిళా వలంటీర్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. సీపీసీ 119/4 ప్రకారం కేసుల నమోదుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది.

 ఈ జిఓ పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందిస్తూ అవసరమైతే తనని అరెస్ట్ చేసుకోవచ్చని, చిత్రహింసలు కూడా పెట్టుకోవచ్చంటూ సవాల్ చేశారు. జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రాసిక్యూషన్‌ అంటే సిద్ధంగానే ఉన్నానని చెబుతూ “నన్ను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. గుర్తుపెట్టుకో జగన్ నీ ప్రభుత్వాన్ని కిందకి లాగేది ఇదే. మైనింగ్‌ అక్రమాల సంగతి కూడా చూస్తాం. కేసులకు భయపడే వ్యక్తిని అయితే పార్టీ ఎందుకు పెడతాను. ఎక్కడికి వచ్చి అయినా నన్ను విచారించుకోవచ్చు” అని వెల్లడించారు.
 
వాలంటీర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని చెబుతూ ఆ డేటా ఎక్కడకు వెడుతుందని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని ఓ ఎజెన్సీకి వెళ్తోందని, ఆ కంపెనీ వైకాపా నేతలదని చెబుతున్నారని ఆరోపించారు. డేటా చౌర్యం గురించి కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
 23 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించి ఎక్కడికి పంపుతున్నారు? సమాచారం సర్వర్‌లో పెట్టుకున్నా కూడా నేరమే అని స్పష్టం చేశారు.  వ్యక్తిగత సమాచారం భద్రపరచుకోవడం చాలా ముఖ్యం అంటూ సమాచార సేకరణపై ప్రభుత్వ విధి విధానాలు ఏమిటి? అని నిలదీశారు. వాలంటీర్లు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.