మణిపూర్ లో పరిస్థితులపై ఆర్ఎస్ఎస్ ఆందోళన

మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్‌లోని బాధిత కుటుంబాలకు శాంతి, పరస్పర విశ్వాసం,  అవసరమైన సహాయం అందించడానికి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది.  తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఊటీ (నీలగిరి జిల్లా)లో13వ తేదీ నుండి మూడు రోజులపాటు జరిగిన వార్షిక అఖిల భారతీయ “ప్రాంత్ ప్రచారక్ బైఠక్”లో మణిపూర్ లో ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు బాధిత ప్రజలకు సహాయక చర్యలను విస్తరించడంపై కూడా చర్చించారు.
 
సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సామరస్యాన్ని పెంపొందించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. అదనంగా, శాశ్వత శాంతి, పునరావాసం కోసం సాధ్యమైన ప్రతి చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ మార్గదర్శనంలో జరిగిన ఈ సమావేశాలలో సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, ఇతర అఖిలభారత అధికారులు కూడా పాల్గొన్నారు.
సంఘ్ శాఖలను తమ  సామాజిక బాధ్యతలతో మరింత సమీకృతం చేయడానికి, మరింత చురుకుగా ఉండేలా వారిని ప్రోత్సహించడానికి మార్గాలను గురించి  చర్చించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలలోని మండి, కులు, ఇతర జిల్లాలలో ఇటీవలి వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కోసం సంఘ్ నిర్వహించిన సేవా కార్యక్రమాలను బైఠక్ సమీక్షించింది. తక్షణ చర్యలను పరిశీలించారు. ఇటీవలి విపత్తుల సమయంలో వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందరితో పంచుకున్నారు.
 
సంఘ శాఖలు తమ సామాజిక బాధ్యతలు, చుట్టుపక్కల ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా వివిధ సామాజిక, సేవా కార్యక్రమాలను చేపడతాయి. బైఠక్‌లో అటువంటి కార్యకలాపాల వివరాలు, అనుభవాలను తెలియచేసుకొని, వాటిపై చర్చలు జరిపారు. ఈ దిశగా ప్రతి సంఘ శాఖ తమ చురుకైన ప్రమేయాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు.
 
2023 సంవత్సరంలో, సంఘ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్షాలతో సహా మొత్తం 105 సంఘ శిక్షా వర్గ్‌లు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 21,566 మంది శిక్షకులు పాల్గొన్నారు. వీరిలో నలభై ఏళ్లలోపు 16,908 మంది, నలభై నుంచి అరవై ఐదేళ్ల మధ్య వయసున్న 4,658 మంది శిక్షకులు పాల్గొన్నారు.
బైఠక్‌లో అందిన సమాచారం ప్రకారం, సంఘ్ మొత్తం 63,724 రోజువారీ శాఖలు దేశవ్యాప్తంగా 39,451 స్థానాల్లో పనిచేస్తున్నాయి, 23,299 సప్తహిక్ మిలన్‌లు (వారపు సమావేశాలు) మరి,యు 9,548 మాసిక్ మండలీలు (నెలవారీ సర్కిల్‌లు) ఇతర ప్రదేశాలలో ఉన్నాయి.
 
రాబోయే శతాబ్ది సంవత్సరానికి సంఘ్ భవిష్యత్తు కార్యకలాపాల విస్తరణ,శతాబాది విస్తారక్ యోజన (శతాబ్ది విస్తరణ ప్రణాళిక) గురించి కూడా బైఠక్ లో సమీక్ష జరిపారు.  బైఠక్‌లో సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.  సంఘ్ నుండి ప్రేరణ పొందిన వివిధ సంస్థల అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శులు కూడా సమావేశాల్లో పాల్గొన్నారు.