2021 ఫిబ్రవరిలో నాటి ముఖ్యమంత్రి ఎడపాటి పలనిసామి సెక్యూరిటీ విధుల్లో భాగంగా, ఉలుందూర్ పేటకు అప్పుడు స్పెషల్ డీజీపీగా ఉన్న రాజేశ్ దాస్ తో కలిసి ఒకే వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో తనపై రాజేశ్ దాస్ లైంగిక దాడికి ప్రయత్నించాడని మహిళా ఐపీఎస్ అధికారి ఆరోపించారు. ఈ ఆరోపణ అప్పట్లో సంచలనం సృష్టించింది. వెంటనే, రాష్ట్ర డీజీపీ ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం రాజేశ్ దాస్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అలాగే, ఆరుగురు సభ్యులతో ఒక ప్రత్యేక విచారణ కమిటీని వేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయాన్ని కూడా డీఎంకే నేత స్టాలిన్ అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నారు.
ఈ ఘటనను షాకింగ్ గా పేర్కొంటూ మద్రాస్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. డీజీపీ స్థాయి వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మహిళా ఐపీఎస్‌ను మరో అధికారి అడ్డుకోవడం షాక్‌కు గురిచేస్తోందని అభిప్రాయపడింది. ఈ కేసు దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది.
మహిళా ఐపీఎస్ అధికారిణి ఆరోపణలపై సీబీసీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. నాటి స్పెషల్ డీజీపీ రాజేశ్ దాస్ పై, అప్పటి చెంగల్పేట్ ఎస్పీ పై ఐపీసీతో పాటు, తమిళనాడు రాష్ట్ర మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. స్పెషల్ డీజీపీ రాజేశ్ దాస్ తో పాటు అప్పటి చెంగల్పేట్ ఎస్పీ తనను ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని, బెదిరించారని ఆ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆయన అప్పీలుకు వెళ్లడంతోపాటు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పులో పేర్కొంది.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు
మహాకుంభమేళాలో ‘సనాతన బోర్డు’ ముసాయిదా