మయన్మార్ నుండి వివిధ తెగల వలసలపై అమిత్ షా దృష్టి

 
ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సరిహద్దు పట్టణం మోరేలో పర్యటించారు. చైనాకు సరిహద్దుల్లోని ఈ ప్రాంతం ఇప్పటి ఘర్షణల దశలో అత్యంత సునిశిత కేంద్రం అయింది. ఇక్కడి భద్రతా పరిస్థితిని, చేపట్టిన చర్యలను కేంద్ర హోంమంత్రి ఉన్నతాధికారుల స్ధాయి సమీక్షలో చర్చించారు.
ప్రత్యేకంగా కుకీలు ఇతర ప్రధాన తెగల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. మణిపూర్‌లో కుకీలు, మైతీలు, నాగాల మధ్య వైరం అదుపు తప్పిన పరిస్థితి ఏర్పడింది. ఈశాన్య సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక్కడి సంక్లిష్టత కేంద్రానికి ఆందోళన కల్గిస్తోంది. మణిపూర్‌లోని మోరే మయన్మార్‌కు కూడా సమీపంలో ఉండటం, అక్కడి నుంచి వివిధ తెగల వా రు అక్రమంగా వలస రావడం వంటి సంక్లిష్టతల పై కూడా అమిత్ షా దృష్టి సారించారు.
 
రాష్ట్రంలో తమ మూడో రోజుల పర్యటనలో భాగంగా తాను కుకీ తెగల ప్రతినిధి బృందాన్ని కలిసినట్లు, అదే విధంగా ఇతర వర్గాల వారితో నూ మాట్లాడానని తెలిపిన అమిత్ షా రాష్ట్రంలో సాధారణ పరిస్థితుల కల్పనకు తీసుకునే చర్యల దిశలో వారి సంపూర్ణ మద్దతు ప్రకటించారని వివరించారు.  ఇక్కడి సీనియర్ అధికారులతో తాను పరిస్ధితిని క్షుణ్ణంగా చర్చించినట్లు ఆ తర్వాత అమిత్ షా విలేకరులకు తెలిపారు. 
అమిత్ షా గురువారం కూడా మణిపూర్‌లోనే ఉంటారు. రాష్ట్రంలో త్వరితగతిన సాధారణ పరిస్థితులు ఏ ర్పడాలని వివిధ వర్గాలు ఆశిస్తున్నారని, పలు వర్గాలకు చెందిన వారితో మాట్లాడినప్పుడు సృహద్భావ సంకేతాలు వెలువడ్డాయని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.  మణిపూర్ పోలీసు, కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్), సైన్యంతో కూడా మూడు రోజులు అమిత్ షా విస్తృత చర్యలు సాగుతున్నాయి.
ఆదివారం మణిపూర్‌లో వేర్పాటువాదు లు మారణాయుధాలతో దాడులకు దిగడం, వీరి ని అణచివేసేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడంతో పలు చోట్ల ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి.   ఈ క్రమంలో దాదాపు 50 మంది వరకూ ఉగ్రవాదులు మృతి చెందడం వంటి పరిణామాలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి.
ఎస్‌టి కోటా విషయంపై కుకీలు, మై తీల మధ్య నెలకొన్న వివాదం చల్లారే దశలోనే ఉన్నట్లుండి వేర్పాటువాద శక్తులు విజృంభించడంతో శాంతిభద్రతల పరిరక్షణ ఇప్పుడు భద్రతా బలగాలకు సవాలు అయింది.  తెగల మధ్య ఘర్షణలు ముప్పును తెచ్చిపెడుతాయని భావించి కేంద్ర హోం మంత్రి ఇక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు, సమీక్షించేందుకు మణిపూర్‌కు వచ్చారు.