కర్ణాటక మంత్రులలో నలుగురికి నేరచరిత్ర

కర్ణాటకలో 9 మంది మంత్రులు కోటీశ్వరులేనని, వారిలో మరో నలుగురికి నేర చరిత్ర ఉందని ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. తొమ్మిది మంది కర్ణాటక మంత్రుల సగటు ఆస్తులు 229.27 కోట్లుగా విశ్లేషించించింది.
 
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా 10 మంది మంత్రుల్లో తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి అఫిడవిట్‌ల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. తొమ్మిది మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడవిట్లలో ప్రకటించుకున్నారు. నలుగురు మంత్రులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని తెలిపారు.
 
తొమ్మిది మంది మంత్రుల ఆర్థిక నేపథ్యాన్ని ఎత్తిచూపుతూ కర్ణాటకలోని తొమ్మిది మంది మంత్రులూ కోటీశ్వరులేనని నివేదిక పేర్కొంది.తొమ్మిది మంది మంత్రుల సగటు ఆస్తులు రూ. 229.27 కోట్లు అని విశ్లేషించింది.కర్ణాటక ఏకైక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్  రూ. 1,413.80 కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించారు.
 
డిప్యూటీ సీఎం శివకుమార్ అత్యంత ధనవంతుడు కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే అత్యల్పంగా తక్కువ మొత్తం ఆస్తులతో మంత్రిగా ఉన్నారు. చిత్తాపూర్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ప్రియాంక్ తన ఆస్తుల విలువ రూ.16.83 కోట్లుగా ప్రకటించారు.
మంత్రుల విద్యార్హతను పరిశీలించగా వారిలో ముగ్గురు మంత్రులు తమ విద్యార్హత 8వ తరగతి నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత మధ్య ఉన్నట్లు ప్రకటించారు. ఆరుగురు మంత్రులకు గ్రాడ్యుయేట్లు అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉందని ప్రకటించారని నివేదిక పేర్కొంది.

ఐదుగురు మంత్రుల వయస్సు 41 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని, నలుగురు మంత్రులు 61 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్నట్లు ప్రకటించారు. కొత్త కర్ణాటక కేబినెట్‌లో మహిళా మంత్రులు లేరని కూడా నివేదిక ఎత్తి చూపింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా శివకుమార్‌తో పాటు డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిద్దరితోపాటు మరో ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.