
సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ద కేరళ స్టోరీ’ కలకలం రేపింది. కేరళ నుంచి 32000 మంది మహిళలు బలవంతపు మత మార్పిడికి గురయ్యారని, తర్వాత ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరారని ఆ సినిమా ట్రయిలర్ విడదలైనప్పటి నుంచి టాక్ ఉంది. అయితే తర్వాత ట్రయిలర్‌లో పేర్కొన్న ఆ 32000 సంఖ్యను తీసేశారు.
రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాపై ట్విట్టర్‌లో ఏమి రాశారంటే…‘ద కేరళ స్టోరీ సినిమా ప్రధాన స్రవంతి బాలీవుడ్ మృత్యు ముఖాన్ని, దాని వికృతంగా చూపించే దయ్యపు అద్దం వంటిది.’ మరోపోస్ట్‌లో ‘ ద కేరళ స్టోరీ నుంచి నేర్చుకోవడం అన్నది కష్టం. ఎందుకంటే అబద్ధాన్ని కాపీ చేయడం చాలా సులభం, కానీ సత్యాన్ని కాపీ చేయడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.
`మనకు మనం అబద్ధాలు చెప్పుకోవడం, ఇతరులకు అబద్ధాలు చెప్పడంలో మనం సౌక్యాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే ఎవరైనా ముందుకెళ్లి నిజాన్ని చూపిస్తే మనం దిగ్భ్రాంతికి గురవుతాం. ద కేరళ స్టోరీ విజయంపై బాలీవుడ్ చచ్చే నిశబ్దాన్ని పాటిస్తోంది’ అని కూడా ఆయన రాశారు.
ద కేరళ స్టోరీ సినిమాకు రామ్‌గోపాల్ వర్మ ఒక్కడే మద్దతు ఇచ్చారని కాదు…ఇదివరలో షబానా ఆజ్మీ కూడా గళం విప్పారు. ‘ఎవరైతే ఈ సినిమాను నిషేధించాలని కోరుతున్నారో వారు తప్పుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరలో ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ ఛద్దా’ సినిమాను కూడా వారు నిషేధించాలనే కోరారు’ అని ఆమె పేర్కొన్నారు. ఆమె వాదనతో నటి కంగనా రనౌత్ కూడా అప్పట్లో ఏకీభవించారు.
ఇటీవల నటుడు మను రిషీ చద్దా ‘హిందుస్థాన్ టైమ్స్’ కు ఇచ్చిన ఇంటర్వూలో కళను ఎప్పటికీ నిషేధించకూడదని స్పష్టం చేశారు. ‘నేను దాని గురించే మాట్లాడుతున్నాను. ఎవరు దాని గురించి మాట్లాడదలచుకోలేదో..అది వారిష్టం. ఇప్పుడు మౌనంగా ఉన్న వారు రేపు నోరు విప్పరని కాదు. నిషేధపు నిర్వచణం విస్తరించినప్పుడు, యావత్ పరిశ్రమ గళం విప్పుతుంది’ అని తెలిపారు.
`కెమెరా మ్యాన్ దగ్గర నుంచి ఫిలిం ఎడిటర్ వరకు, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఇప్పుడు మౌనంగా ఉన్నవారు రేపు మాట్లాడతారని నేను హామీ ఇస్తున్నా’ అని చెప్పారు. మే 5న విడుదలైన ‘ద కేరళ స్టోరీ’ ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద రూ. 187 కోట్లు రాబట్టింది.
More Stories
కర్ణాటకలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!