కుమారుడిని విడిచిపెట్టమని వాంఖడేను వేడుకున్న షారుఖ్

కుమారుడిని విడిచిపెట్టమని వాంఖడేను వేడుకున్న షారుఖ్
 
2021 డ్రగ్స్  ​ కేసులో ఆర్యన్​ ఖాన్​ అరెస్ట్​ అయిన తర్వాత ముంబైలోని అప్పటి ఎన్​సీబీ (నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) జోనల్​ డైరక్టర్​ సమీర్​ వాంఖడేతో ప్రముఖ బాలీవుడ్​ నటుడు షారుఖ్​ ఖాన్​ ఛాట్​ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తన కుమారుడిని విడిచిపెట్టమని సమీర్​ వాంఖడేను షారుఖ్​ వేడుకున్నట్టు ఈ ఛాట్స్​ చెబుతున్నాయి.

సమీర్​ వాంఖడేకు షారుఖ్​ ఖాన్​ చేసిన మెసేజ్​లు ఇవేనని సోషల్​ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  సమీర్​ వాంఖడే చాట్:  “మనమిద్దరం గర్వపడే స్థాయికి ఆర్యన్​ ఖాన్​ చేరుకుంటాడు. ఈ ఘటన (డ్రగ్స్​ కేసులో అరెస్ట్​) ఆర్యన్​ జీవితంలోనే కీలక మలుపుగా ఉంటుంది. మంచిగా ఉపయోగపడుతుంది”

“గాడ్​ బ్లెస్​ యూ. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు వచ్చి నీకు నేను హగ్​ ఇస్తాను. నీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పు. నీ మీద నాకు ఎప్పటి నుంచో గౌరవం ఉంది. ఇప్పుడు ఆ గౌరవం చాలా రెట్లు పెరిగింది.” “నీ ఇంటిగ్రిటీ కోల్పోకుండా.. ఏ విధంగా సాయం చేసినా నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను.”

షారుఖ్​ ఖాన్ చాట్:

 “ఈ ఘటనలో ఆర్యన్ పాత్ర చాలా చిన్నది. ఆ విషయం నీకు కూడా తెలుసు. అతనికి సంస్కరణ తెలియాలి. తాజా పరిస్థితులతో తెలిసి వచ్చింది. ఆర్యన్​ను గొప్ప మనిషిగా తీర్చిదిద్దేందుకు నేను హామీనిచ్చాను. చేసి చూపిస్తాను.” “ఐ బెగ్​ యూ. నీ మనుషులను కాస్త నెమ్మదించమను. ఇలా చేస్తే.. నీ వెన్నంటే నేను ఉంటాను. మంచి చేయాలన్న నీ లక్ష్యానికి సాయం చేస్తాను. ఇది నా హామీ. నా హామీని నేను నెరవేర్చుకుంటానని నీకు తెలుసు.”

“నా ఆర్యన్​ కాస్త దారితప్పాడు! నా మీద, నా కుటుంబం మీద కాస్త జాలి చూపించు. దారితప్పినంత మాత్రాన కఠినమైన నేరాలు చేసినట్టు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఆర్యన్​కు లేదు. నీకు కూడా ఈ విషయం తెలుసు. మంచి హృదయంతో ఆలోచించు.” “ఈ రోజు మా మనసులను ముక్కలు చేయకు. ప్లీజ్​. ఇది ఒక తండ్రి.. మరో తండ్రిని అడుగుతున్న రిక్వెస్ట్​ అనుకో. నీలాగే ఒక తండ్రిగా నేను నా బిడ్డలను ప్రేమిస్తున్నాను. బయట ఎన్ని పరిస్థితులు ఉన్న ఈ తండ్రి భావనలను మనం విడిచిపెట్టకూడు.”

“ఈ పూర్తి వ్యవహారంపై నా ప్రవర్తనను నువ్వు గుర్తించే ఉంటావు. నువ్వు చేసే ఏ పనిని నేను వ్యతిరేకించను. ‘ఆర్యన్​ను నా సొంత మనిషిగా భావిస్తున్నా’ అని నువ్వు చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను. ఆర్యన్​ను మంచి మనిషి చేయాలని ఉంది.”

 “నేను మీడియా ముందుకు వెళ్లలేదు. నా కుమారుడికి సాయం చేసే విధంగా నేను ఏం చేయలేదు. నేను ఏ స్టేట్​మెంట్​ ఇవ్వలేదు. నీ మంచితనంపై నమ్మకం పెట్టుకున్నాను. నన్ను ఓ తండ్రిగా తలదించుకునేలా చేయకు. ప్లీజ్​. ప్లీజ్​.” ఈ ఛాట్​కు సంబంధించిన ఓ నివేదిక ఆన్​లైన్​లో వైరల్​గా మారింది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియవలసి ఉంది.

క్రూజ్​ పార్టీలో డ్రగ్స్​ దొరికిన కేసులో 2021 అక్టోబర్​లో ఆర్యన్​ ఖాన్​ను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. దాదాపు నెల రోజుల పాటు అతను ముంబై జైలులో ఉన్నాడు. ఆర్యన్​ ఖాన్​పై వేసిన ఆరోపణలను ఎన్​సీబీ రుజువు చేయలేకపోవడంతో ఆర్యన్​ ఖాన్​కు బెయిల్​ వచ్చింది.

ఆర్యన్​ ఖాన్​కు క్లిన్ చిట్  ​ ఇస్తున్నట్టు గతేడాది మేలో ఎన్​సీబీ ప్రకటించింది. ఆర్యన్​ ఖాన్​ డ్రగ్స్​ వాడలేదని పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తులో లోపాలు ఉన్నాయని వివరించింది. ఆర్యన్​ ఖాన్​ విషయంలో.. షారుఖ్​ ఖాన్​ను సమీర్​ వాంఖడే బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్యన్​ ఖాన్​ను రక్షించేందుకు షారుఖ్​ను సమీర్​ రూ. 25కోట్లు అడిగారన్నది ప్రధాన ఆరోపణ. తాను ఎలాంటి తప్పు చేయలేదని సమీర్​ వాంఖడే చెబుతున్నారు.