సీఎం పదవికి బసవరాజ్ బొమ్మై రాజీనామా!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన పదవికి శుక్రవారం రాత్రి రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానని, రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ వ్యవస్థీకృత ఎన్నికల వ్యూహం ఫలించిందని,  ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అదీ కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించింది. కేవలం 65 సీట్లు గెలుచుకున్న బిజెపి ప్రత్యర్థి స్థానంతో సరిపెట్టుకుంది.  ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం బసవరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహించిన బసవరాజ బొమ్మై రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలిశారు.

మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తన సిఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, బసవరాజ బొమ్మై సిఎం ఎంపిక అయ్యారు. 2021 జూలై 26న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొమ్మై 19 నెలల 17 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదవీ విరమణ ప్రకటనతో యడ్యూరప్పకు అనుకోని పరిణామంగా ముఖ్యమంత్రి పదవి దక్కింది.

రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన బసవరాజ్ బొమ్మై ‘‘గవర్నర్‌ను కలిసిన తర్వాతే రాజీనామా చేశాను. ప్రజల తీర్పును గౌరవప్రదంగా అంగీకరించామని, పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే నేనే బాధ్యత తీసుకుంటా. పోయినసారి 104 సీట్లు రాగా, ఈసారి తక్కువ శాతం సీట్లు వచ్చాయి. ఏది జరిగినా ఓటమి ఓటమే. దీనిపై ఆత్మపరిశీలన చేసుకొని ఎక్కడ తప్పు ఉందో సరిదిద్దేందుకు కృషి చేస్తామము” అని చెప్పారు.

తమది జాతీయ పార్ అని చెబుతూ కేవలం ఎన్నికల కోసం మాత్రమే పని చేయమని, దేశ నిర్మాణానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.  లోక్‌సభ ఎన్నికలు కేవలం 8-10 నెలల్లో రానున్నాయి. ఆ ఎన్నికల కోసం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని బొమ్మై తెలిపారు. పార్టీ పరంగా ఎదురైన అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతామని, మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందని బొమ్మై తెలిపారు.

లోపాలను సరిదిద్దుకుంటూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామేంటో నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బీజేపీ పని చేస్తుందని చెప్పారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా పర్యటనల ప్రభావం కర్ణాటకలో ఏమాత్రం కనిపించలేదు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. ఈ ఓటమికి బోలెడు కారణాలు ఉంటాయని చెప్పారు. పూర్తిగా సమస్యను విశ్లేషించిన తర్వాతనే ఎవరైనా మాట్లాడాలి తప్ప నోటికొచ్చింది మాట్లాడటం సరికాదని బదులిచ్చారు

ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఎన్నికలకు దిక్సూచి కాదని చెబుతూ గతంలో ఎన్నో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను చూశామని పేర్కొన్నారు. వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొంటూ వాటిని కూర్చుని చర్చించాలని చెప్పారు. ఏం తేడా వచ్చిందో.. ఎక్కడ ఏం జరిగిందో చర్చించి జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని తెలిపారు.