
రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్దం తర్వాత తైవాన్ పై చైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. ఇప్పటికే ‘జాయింట్ స్వోర్డ్’ పేరుతో తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలను చైనా సైనిక విన్యాసాలతో బలగాలను మొహరించింది.
ఈ నేపథ్యంలోనే తైవాన్ పై ఎప్పుడైనా యుద్ధం మొదలు కావచ్చని చైనా స్పష్టం చేసింది. అందుకు సిద్ధంగా ఉండాలని తైవాన్ ను హెచ్చరించింది. యుద్ధం ఎప్పుడు మొదలైనా సరే, పోరాడేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, స్వాతంత్రం కోసం తైవాన్ ప్రయత్నించినా, ఈ విషయంలో విదేశాలు జోక్యం చేసుకున్నా అందుకు తాము ధీటుగా బదులిస్తామంటూ చైనా సైన్యం తైవాన్ కు గట్టి హెచ్చరిక ఇచ్చింది.
మూడు రోజుల పాటు తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా యుద్ధ విన్యాసాలు చేస్తుండటంతో యుద్ధం త్వరలోనే మొదలవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. గత వారం తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌వెన్ అమెరికా పర్యటన తర్వాత తైవాన్ చుట్టూ చైనా సైన్యం మూడు రోజుల భారీ పోరాట విన్యాసాలు చేసింది.
ఈ విన్యాసాల్లో చైనా గగనతల పోరాట సామర్థ్యాలపై దృష్టిసారించింది. తొలిసారిగా జె-15 యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొనగా, అవి చైనా విమాన వాహకనౌకల నుంచి తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 35 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధిలోని మీడియన్ లైన్‌ను దాటాయి. షాండాంగ్ విమాన వాహకనౌకను కూడా పసిఫిక్ మహాసముద్రంలో చైనా ఉపయోగించింది.
సైనిక సన్నద్ధతను చాటిచెప్పే డ్రిల్లులో యుద్ధ విమాన వాహక నౌకలు, సుదూర రాకెట్లు, ఫైటర్ జెట్లు, క్షిపణులు పాల్గనాుయి. ‘జాయింట్ స్వోర్డ్’ పేరుతో ద్వీపానికి నలువైపులా పిఎల్‌ఎ తూర్పు థియేటర్ కమాండో దళం విన్యాసాలను ముమ్మరం చేసినట్లు చైనీస్ సెంట్రల్ టెలివిజన్ చానెల్ (సిసిటివి) తెలిపింది.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!