
అమెరికా చరిత్రలో మొదటిసారిగా మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. 2016 ఎన్నికలకు ముందు శృగార తార స్టార్మీ డానియల్స్‌తో సంబంధం వెల్లడి కాకుండా ఉండేందుకు ఆమెకు భారీగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం చేసుకున్న కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు దాదాపు రుజువయ్యాయి.
అయితే ఈ కేసులో ఏప్రిల్ 4వ తేదీన న్యూయార్క్ క్రిమినల్ కోర్టులో ట్రంప్ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అరెస్టుకు కోర్టు ఆదేశాలు ఇచ్చేందుకు ముందే తానే స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోవాలని, ఆరోపణలపై విచారణకూ హాజరు కావాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.
ట్రంప్ వచ్చే వారం మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయంలో లొంగిపోయే అవకాశం ఉందని ట్రంప్ తరఫు లాయర్(అటార్నీ) జోయ్ టాకోపినా ఓ ప్రకటన చేశారు. మరోవైపు ట్రంప్ లీగల్ టీమ్ కూడా ప్రాసిక్యూటర్‌తో టచ్‌లో ఉందని వినికిడి.
కేసు నమోదైన తర్వాత ఆ కేసుకు జడ్జి ఎవరో అన్న విషయాన్ని తేల్చుతారు. ఆ తర్వాత విచారణ ఎప్పుడు మొదలుపెట్టాలన్న విషయాన్ని కూడా చెబుతారు. బెయిల్ ఇస్తారా అన్న కోణంలో కూడా చర్చలు జరగనున్నాయి. ఒకవేళ నేరం రుజువు కాకపోతే ట్రంప్‌కు కేవలం జరిమానా వేసి వదిలేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నేరం రుజువైతే ట్రంప్‌కు కనీసం నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ జైలు శిక్ష లేకుండానే కేవలం జరిమానాతో ఆ కేసును క్లియర్ చేయవచ్చు అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే, లైంగిక కుంభకోణం కేసులో దోషిగా తేలినప్పటకీ 2024 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ వేసిన బిడ్‌పై అనర్హత వేటు పడదు. ఎందుకంటే గత ఏడాది నవంబర్‌లోనే జరిగిన ఎన్నికలకు ట్రంప్ తన అభ్యర్థిత్వ పత్రాలను దాఖలు చేశారు.
తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ట్రంప్ స్పందిస్తూ ఒక నకిలీ, అవినీతి, అవమానకర ఆరోపణలు తనపై చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రుత్ సోషల్ మీడియాలో ఇది రాజకీయ కక్షతో కూడుకున్నదని మండిపడ్డారు. దీనిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
2018లో ‘ఫుల్ డిస్‌క్లోజర్’ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకున్న పరిచయం, ఇతర విషయాలను స్టార్మీ డేనియల్స్ వెల్లడించింది. 2018లో ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూ ద్వారా అనేక సంచలన విషయాలు ఆమె వెల్లడించింది.
డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో శృంగారం చేశారని, పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. ఆ విషయాన్ని బయటపెట్టకూడదంటూ తనను బెదిరించిట్లు ఆమె వెల్లడించారు. 2016 ఎన్నికలకు ముందు, ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ లాయరు తనకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్మార్టీ డేనియల్స్ చెప్పారు.
ఆ తర్వాత, ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాదే డేనియల్స్ ఆరోపణలు నిజమేనంటూ ప్రకటించారు. ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కోహెల్ 1,30,000 డాలర్లు డేనియల్స్‌కు ముట్టజెప్పారని, తరువాత ఆ మొత్తాన్ని కోహెన్‌కు ట్రంప్ అందజేశారని న్యాయవాది రూడీ గియూలియానీ చెప్పారు. రికార్డుల్లో ఈ మొత్తాన్ని లీగల్ ఫీజు కింద చెల్లించినట్టు ఉందన్నారు. ఈ కేసులో ఐదేండ్లుగా ట్రంప్‌పై విచారణ కొనసాగుతున్నది.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!