ఉగ్రవాదం నుండి స్టార్టప్ ఎకోసిస్టమ్ వైపు జమ్మూ కశ్మీర్‌

ఉగ్రవాదం నుండి స్టార్టప్ ఎకోసిస్టమ్ వైపు జమ్మూ కశ్మీర్‌
జమ్మూ కశ్మీర్‌లో క్రైమ్ రేట్, మిలిటెన్సీ గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, అంతకుముందు ఉన్న ‘వేర్పాటువాద పర్యావరణ వ్యవస్థ’ను  నుంచి స్టార్టప్ ఎకోసిస్టమ్ భర్తీ చేసిందని  జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.
 
అలాగే జమ్మూ కశ్మీర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో విధ్వంసకారుల గురించి మాట్లాడుతూ ‘ఇది ఒక పాత సంప్రదాయం. వారు (ఉగ్రవాదులు) అక్కడ ఉన్నారు, ఉంటారు. వారిని గుర్తించడం, తొలగించడం అనేది నిరంతర ప్రక్రియ.’ అని చెప్పారు. ఢిల్లీలో న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌ కలిసి నిర్వహించిన రెండు రోజుల సదస్సులో మాట్లాడారు.  ‘2019 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్ధు చేస్తూ బలమైన సంకల్ప శక్తితో నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా జమ్మూ కశ్మీర్‌లో చరిత్రాత్మక మార్పు వచ్చింది. ఆ నిర్ణయం, ఈ ప్రాంత ప్రజలందరూ కలలు కనేలా, ఇతర భారతీయులందరిలాగే ఆకాంక్షించేలా చేసింది’ అని ఆయన చెప్పారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేసింది. తర్వాత రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు. ఆ తర్వాత వచ్చిన మార్పులను మనోజ్ సిన్హా వివరించారు.

అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ జమ్మూ కశ్మీర్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు, మొత్తం ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, భద్రత, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, విద్య, పర్యాటకం వంటి అన్ని రంగాల్లో భారీ అభివృద్ధిని సాధించిందని ఆయన వివరించారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేసింది. తర్వాత రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు. ఆ తర్వాత వచ్చిన మార్పులను మనోజ్ సిన్హా వివరించారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ.. జమ్మూ కశ్మీర్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు, మొత్తం ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, భద్రత, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, విద్య , పర్యాటకం వంటి అన్ని రంగాల్లో భారీ అభివృద్ధిని సాధించిందని ఆయన వివరించారు.

Ads by