బాంబే హైకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తాను జాతీయ గీతాన్ని అగౌరవపర్చానంటూ దాఖలైన పిటిషన్‌ను రద్దు చేయాలంటూ మమతాబెనర్జి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.  2021, డిసెంబర్‌లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతాబెనర్జి జాతీయ గీతాన్ని అగౌరవపర్చారంటూ బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.
ఈ నేపథ్యంలో తాను నేరం చేయలేదని, ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని మమతాబెనర్జి అప్పీల్‌ చేశారు. ఆ అప్పీల్‌ను తాజాగా కోర్టు తోసిపుచ్చింది.  2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవ పరిచినందుకు మమతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ బీజేపీ నేత మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు.
ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కోర్టుకు సమర్పించారు. అనంతరం ఈ అంశం బాంబే హైకోర్టుకు చేరింది. మమత ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆమె లేచి నిలిబడలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.