
గ్రూప్–1, ఏఈ పేపర్ సహా ఆరు పేపర్స్ లీకేజీ వివరాలు సేకరించేందుకు నిందితులను మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, ధాక్యా నాయక్, రాజేశ్వర్‌లతోపాటు షమీమ్, రమేశ్, సురేశ్‌ను ఆరురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై శనివారం విచారణ జరుగనుంది.
ఇక టీఎస్ పీఎస్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దామెర రమేష్‌కు కూడా రాజశేఖర్ ద్వారానే పేపర్ వెళ్లింది. ప్రవీణ్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్‌కు చేరింది. వీరితో పాటు మాజీ టెక్నీషియన్ సురేశ్ కూడా ఎగ్జామ్ రాశాడు. ఇలా పరీక్షలు రాసిన వీరందరికీ 100పైగా మార్కులు వచ్చాయి.
ఈ వివరాలన్నీ ప్రవీణ్, రాజశేఖర్ సిట్ కస్టడీ విచారణలో వెల్లడించారు. దీంతో షమీమ్, రమేశ్, సురేశ్‌ను సిట్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన 26 మంది టీఎస్ పీఎస్సీ ఉద్యోగులను ఇప్పటికే సిట్ ప్రశ్నించింది.100కు పైగా మార్కులు వచ్చిన 8 మందిలో షమీమ్, రమేశ్ మినహా మిగితా ఆరుగురు ఉద్యోగులకు పేపర్ లీకేజ్‌తో సంబంధం లేదని గుర్తించారు.
ఈ క్రమంలోనే 100కు పైగా మార్కులు వచ్చిన121 మంది అభ్యర్థులను సిట్ విచారిస్తున్నది. ఇందులో 40 మంది విచారణ ఇప్పటికే పూర్తయింది. వీరిలో టీఎస్‌పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేశ్ లీకేజీ పేపర్‌తో పరీక్ష రాసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. మిగతా వాళ్లకు పేపర్ లీకేజీతో సంబంధం లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చారు. టాప్ మార్కులు స్కోర్ చేసిన మరో 80 మందిని విచారిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్‌లతో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను కూడా సిట్సేకరించనుంది.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రమేశ్, మాజీ టెక్నీషియన్ సురేష్ రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ కీలక వివరాలు వెల్లడించింది.12 మంది నిందితులు 19 మంది సాక్షులతో కూడిన రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు అందించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని ఇందులో ప్రధాన సాక్షిగా పేర్కొన్నారు.
నిందితుడు ప్రవీణ్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కనం అనురాజ్, రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న హరీష్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. రేణుక, ఆమె భర్త కర్మాన్‌ఘాట్‌లోని ఆర్ స్క్వేర్ హోటల్ రూమ్ నెంబర్107, 108లో నీలేష్, గోపాల్‌ను ఏఈ పరీక్షకు ప్రిపేర్ చేయించారని పేర్కొన్నారు.
ఈ కేసులో మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేసినవారి నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు సిట్ నిర్థారించింది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అవ్వగా.. తాజాగా అరెస్ట్‌తో ఆ సంఖ్య 13కు చేరుకుంది.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత