దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేరుస్తూ జగన్ తీర్మానం

* 27న ఎస్సీ మోర్చా నిరసన ధర్నాలు
 
దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తండ్రి రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగాచేసిన విఫల ప్రయత్నాన్ని ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. అప్పట్లో ఆయన మాటను ఎంతో విలువఇచ్చే ఓ స్వయంగా క్రైస్తవురాలైన సోనియాగాంధీ కనుసన్నలలో నడిచే కేంద్ర ప్రభుత్వం రాజ్యం చేస్తున్నప్పటికీ ఆయన నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. సుప్రీం కోర్టులో ఇరుక్కుపోయింది.
 
తాజాగా, శాసనసభతో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి జగన్ కేంద్రానికి పంపారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించే నిర్ణయంతో పాటు, బోయలు, వాల్మీకి కులాల వారిని కూడా ఎస్టీలుగా పరిగణించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ వేర్వేరుగా రెండు తీర్మానాలను ఆమోదించింది.
అయితే, ఈ రెండు నిర్ణయాలు కూడా ఏకపక్షంగా రాష్ట్ర సర్కారు నిర్ణయించగలిగిన అంశాలు కాకపోవడంతో రెండింటినీ తీర్మానాల రూపంలో కేంద్రానికి పంపారు. అందుకనే ఈ రెండు అంశాల్లోనూ రాష్ట్రప్రభుత్వం చేయగలగింది ఏమీ లేదని కూడా జగన్ ప్రకటించి ముందు జాగ్రత్త వహించారు.
 
దళిత క్రిస్టియన్ లను కూడా మైనారిటీలుగా, బీసీలుగా గుర్తిస్తూ ఉంటేనే దేశంలో ప్రతిచోటా విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూత్వాన్ని దారుణంగా చంపేయడానికి క్రైస్తవ సంస్థలు మితిమీరిన మతమార్పిడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.
 
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవ సంస్థల దూకుడు పెరిగిందని, మతమార్పిడులు కూడా పెరిగాయనే ఆరోపణలూ ఉన్నాయి. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ఏళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా దోషులెవరో తేల్చలేని సర్కారు వైఖరిపై కూడా విమర్శలున్నాయి. అలాగే తిరుమలలో అన్యమత ప్రచారం వంటి ఆరోపణలు కూడా తలెత్తుతున్నాయి.
 
ఇన్ని అంశాల నేపథ్యంలో దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించాలనే జగన్ నిర్ణయం హిందూత్వం మీద జరగగల అతిపెద్ద దాడిగా పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది క్రైస్తవ మతం  అనుసరిస్తున్నప్పటికీ, కేవలం రిజర్వేషన్ల సదుపాయాల కోసం హిందువులుగా చెలామణీ అవుతున్నారు. వారందరూ హిందూత్వాన్ని వదలి క్రైస్తవ మతంలోకి వెళ్లిపోయేందుకే జగన్ చర్యలు అని స్పష్టం అవుతుంది.
నిరసనగా 27న బీజేపీ ఎస్సీ మోర్చా ధర్నాలు
 
దళిత క్రిస్టియన్ లకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు అన్నీ జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా ధర్నా కార్యక్రమం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా నిర్ణయించడమైనది.*

అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన దళిత క్రిస్టియన్ బిల్లును బీజేపీ ఎస్సీ మోర్చా  తీవ్రంగా ఖండించింది.
 
దళితులు వేరు, క్రిస్టియన్లు వేరు. దళిత క్రిస్టియన్ లని పేరు ముద్దుగా పెట్టి ఈరోజు నిజమైన ఎస్సీల కోటాని ఇతర మతస్తులు బీసీ.సి లుగా ఒకవైపు, ఎస్సీలుగా మరో వైపు ఇలా రెండు వైపు  రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం మద్దతుగా నిలబడటం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల అసమానతలు, గ్రామీణ స్థాయిలోగానీ, పట్టణాలలో గానీ ఇప్పటికీ అంతరానితనంతో నిత్యము హిందూ భావాలు కలిగి ఈ రాష్ట్రంలో అనేక అవమానాలకు, ప్రాణ త్యాగాలకు నిత్యము స్థానికంగా ఇబ్బందులు పడుతున్న నిజమైన ఎస్సీ దళితులు అణచివేతకు గురవుతున్నారని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ విమర్శించారు.
 
ఈరోజు కేవలం అవకాశవాదులకు బీసీ.సి లో ఉండి క్రిస్టియన్లగా ఉన్న అవకాశవాదులు ఎవరైతే ఉన్నారో వారి కోసం  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం వారి  ఓట్ల కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యక్తిరేకించారు. అన్నీ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని  దేవానంద్ పిలుపిచ్చారు.