“ఎడారికి ఆభరణం”గా బార్మర్ రిఫైనరీ

బార్మర్ రిఫైనరీ రాజస్థాన్ ప్రజలకు ఉద్యోగాలు, అవకాశాలు, ఆనందాన్ని తెస్తుందని, ఇది “ఎడారి  ఆభరణం”గా మారుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ ఎస్. పూరి చెప్పారు. హెచ్‌పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ కాంప్లెక్స్‌ సందర్శించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్ ప్రకారం ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పారు.

రాజస్థాన్‌లోని బార్మర్‌లో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)  జాయింట్ వెంచర్ కంపెనీ అయిన హెచ్‌పిసిఎల్‌ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్‌), రాజస్థాన్ ప్రభుత్వం (జీఓఆర్‌)లకు వరుసగా 74% మరియు 26% వాటా ఉంది.
ఈ ప్రాజెక్ట్ 2008లో రూపొందించగా,  పునర్నిర్మించిన అనంతరం 2018 లో భారత ప్రధానమంత్రి  పనులను ప్రారంభించారు.

కరోనా మహమ్మారి కారణంగా 2 సంవత్సరాల  తీవ్రమైన ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ 60% కంటే ఎక్కువ ప్రాజెక్టు పూర్తయింది
. ఈ రిఫైనరీ కాంప్లెక్స్ 9 ఎంఎంటిపిఎ క్రూడ్‌ను ప్రాసెస్ చేస్తుందని,  2.4 మిలియన్ టన్నులకు పైగా పెట్రోకెమికల్స్‌ను ఉత్పత్తి చేస్తుందని,  అలాగే ఇది పెట్రోకెమికల్స్ కారణంగా దిగుమతి బిల్లును తగ్గిస్తుందని  కేంద్ర మంత్రి తెలిపారు.
 
ఈ ప్రాజెక్ట్ పశ్చిమ రాజస్థాన్‌కు మాత్రమే కాకుండా 2030 నాటికి 450 ఎంఎంటిపిఎ రిఫైనింగ్ సామర్థ్యాన్ని సాధించాలనే దాని దార్శనికత ఇండస్ట్రియల్ హబ్‌గా ఒక యాంకర్ పరిశ్రమగా పని చేస్తుందని చెప్పారు.  ఈ ప్రాజెక్ట్ పెట్రోకెమికల్స్ దిగుమతి ప్రత్యామ్నాయం విషయంలో భారతదేశానికి స్వావలంబనను తెస్తుందని పూరి తెలిపారు. ప్రస్తుత దిగుమతులు రూ.95,000 కోట్లుగా ఉన్నాయని ఈ కాంప్లెక్స్ పోస్ట్ కమిషన్ దిగుమతి బిల్లును రూ.26,000 కోట్లు తగ్గిస్తుందని చెప్పారు.

ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి పరంగా ప్రాజెక్ట్  సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను తెలిపిన మంత్రి..ప్రాజెక్ట్ కాంప్లెక్స్,  చుట్టుపక్కల సుమారు 35,000 మంది కార్మికులు ఉన్నట్టు చెప్పారు. అలాగే ఈ పరిశ్రమ ద్వారా 1,00,000 మంది కార్మికులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.

 
దీంతో పాటు 12వ తరగతి వరకు 600 మంది విద్యార్థులకు క్యాటరింగ్ అందించే కో-ఎడ్ స్కూల్ డిసెంబర్ నాటికి తెరిచే అవకాశం ఉన్నట్లు చెప్పారు.  50 పడకల ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతూ. ఆ మేరకు భూమిని స్వాధీనం చేసుకున్నామని,  డిసెంబర్ 2023 నాటికి ఆస్పత్రి పూర్తవుతుందని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ ప్రయోజనాల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. రిఫైనరీ కాంప్లెక్స్‌లో డెమోయిసెల్లే క్రేన్ వంటి వలస పక్షులకు చిత్తడి నేల ఆవాసాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణానికి మేలు చేసే ఇతర పనులలో సహజ ఉపరితల నీటి వనరుల పునరుజ్జీవనం, పచ్చపద్ర నుండి ఖేడ్ వరకు అవెన్యూ ప్లాంటేషన్ వంటివి ఉన్నాయి.
 
అలాగే కాంప్లెక్స్‌లోని ఎడారి భూములను భూమిలో అధిక ఉప్పును పరిగణనలోకి తీసుకుని గ్రీన్ బెల్ట్‌గా మార్చడానికి ఏఎఫ్‌ఆర్‌ఐ అధ్యయనం చేస్తోంది. సిఫార్సులు అందిన తర్వాత డిపాజిట్ పనుల కింద అటవీ శాఖ సహకారంతో ప్లాంటేషన్‌ను చేపడతామని మంత్రి వివరించారు.

ఈ ప్రాజెక్ట్ వల్ల ఆదాయం పెరగడం గురించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు పెట్రోలియం రంగం మిందో మొత్తం వార్షిక సహకారం దాదాపు రూ. 27,500 కోట్లుగా ఉంటుందని చెప్పారు. అందులో రిఫైనరీ కాంప్లెక్స్ ద్వారా రూ. 5,150 కోట్లు ఉంటుందని, ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా సుమారు రూ. 12,250 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం వస్తుందని చెప్పారు.