ధరణి పోర్టల్ లోపాలపై కిసాన్ మోర్చా చలో అసెంబ్లీ!

ధరణి పోర్టల్ పేరుతో కెసిఆర్ తెలంగాణ రైతుల ఉసురు తీస్తున్నాడని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ లో లోపాలు సరి దిద్ది రైతులకు న్యాయం చేయాలని పోర్టల్ ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు.
 
ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీజేపీ కిసాన్ మోర్చా కార్యకర్తలను అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్ల కు తరలించారు. అసెంబ్లీ సమీపంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులతో కలిసి నిరసనగా వెళుతున్న శ్రీధర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్బంగా ఉద్రిక్తత ఏర్పడింది. అరెస్టు సందర్బంగా శ్రీధర్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ ధరణి పోర్టల్ కల్వకుంట్ల కుటుంబంకు కల్పతరువు గా మారిందని, అవినీతి కేంద్రకృతం చేసి బిఆర్ఎస్ నాయకులు బ్రోకర్ లుగా మారి ధరణి బాధిత రైతుల వద్ద నుండి తక్కువ ధరలకు భూములు కాజేస్తున్నారని ఆరోపించారు,
 
రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ధరణి పోర్టల్ లో తమ భూములు నిషేధిత జాబితాలో చేర్చడంతో ఆత్మ హత్యాలకు పాలపడ్డారని, చెప్పులు అరిగేలా తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయాలకు బిచ్చగాళ్ల మాదిరిగా రైతులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన భూములను పథకం ప్రకారం కాజెయడానికి కెసిఆర్ ధరణి పోర్టల్ తెచ్చాదని మండిపడ్డారు.
 
అనేక మంది కిసాన్ మోర్చా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారాని రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ కిసాన్ మోర్చా విశ్రమించదని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితిల నడుమ శ్రీధర్ రెడ్డిని కిసాన్ మోర్చా నాయకులను అరెస్టు చేసి నారాయణగూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ధరణి పోర్టల్ ను సవరించాలని కోరుతూ దశల వారీగా అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తున్న బీజేపీ కిసాన్ మోర్చా నేతలను  ఎక్కడికక్కడ  అడ్డుకుంటూ పోలీసులు అరెస్ట్ చేశారు.
ధరణి పోర్టల్ వల్ల బాధలు పడుతున్న రైతుల భూములను కాజేసేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని కిసాన్ మోర్చా నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం నుండే బీజేపీ కిసాన్ మోర్చా నాయకులను అరెస్టు చేసిన పోలీసులు, గాంధీనగర్, అబిడ్స్ ముషీరాబాద్, సైఫాబాద్, నారాయణ గూడా, గోషామహల్, నాంపల్లి పోలీస్ స్టేషన్ లకు వందలాది మంది నాయకులు కార్యకర్తలను తరలించారు
 
బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధు సూదన్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జగన్ మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, కిరణ్ గౌడ్, తిరుపతి రెడ్డి నిరంజన్ రెడ్డి, కృష్ణా రెడ్డి, కూర వెంకటయ్య, నర్సింహ రెడ్డి, మోతె గంగన్న, ఏనుగు రాజి రెడ్డి, మోహన్ రెడ్డి, కాటం భాస్కర్ గౌడ్, చావా కిరణ్, ఎల్లా రావు గౌడ్, సురకంటి రంగన్న, రాముడు, మల్లా రెడ్డి కన్నభిరామెన్, రవీందర్ రెడ్డి తదితరులు అరెస్టు అయిన వారిలో వున్నారు