
ప్రతి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని, అభివృద్ధి వేగం బుల్లెట్ రైలుతో సమానంగా ఉందని పేర్కొంటూ, తాము ఉత్తరప్రదేశ్ నుండి మెరుగైన ఫలితాలను పార్టీకి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విభజన రాజకీయాలను రాష్ట్రం మరోసారి తిరస్కరిస్తుందని యోగి చెప్పారు.
రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే వ్యూహంలో భాగంగా యాదవులు, జాతవులు, పస్మాండ ముస్లింలలో తన పునాదిని విస్తరించుకోవాలని బీజేపీ ప్రణాళికలు రూపొందించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి పోటీ చేసిన 78 లోక్‌సభ స్థానాలకు 62 గెలుచుకుంది, భారతదేశంలో రాజకీయంగా ముఖ్యమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం ఒక స్థానాన్ని గెల్చుకుంది.
ముస్లింలపై భగవత్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నా
నిర్ణీత గడువులోగా అయోధ్యలో రామమందిరం పనులు పూర్తవుతాయని సీఎం యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
కాగా, ఇటీవల ‘రామచరిత మానస్’పై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ అభివృద్ధిని కాకుండా విభజనను నమ్ముకునేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. రామచరిత మానస్ పై వివాదాలు రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం అని, ప్రతి ఇంట్లోనూ పూజిస్తారని తెలిపారు. దీని ప్రాముఖ్యత తెలియని వారు ప్రశ్నలను లేవనెత్తుతున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, “తులసీదాస్ రచించిన ఈ రామయణంలోని కొన్ని భాగాలు కులం ప్రాతిపదికన సమాజంలోని విస్తృత వర్గాలను అవమానించేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని” యూపీలో ప్రముఖ ఓబీసీ నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. అయితే, మౌర్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని సమాజ్ వాదీ పార్టీ వివరణ ఇచ్చుకుంది.
ఈ అంశంపైనే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం యోగి సమాజ ఐక్యతకు మార్గదర్శకంగా నిర్వచించిన హిందూ పవిత్ర గ్రంథాన్ని విమర్శించే వారిపై చర్యలు ప్రారంభించామని చెప్పారు. తాను యోగిని అని, యోగిగా తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నానని పేర్కొంటూ అయితే ప్రజలు తనను వారు కోరుకున్న విధంగా గ్రహించగలరని ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
సుపరిపాలన ద్వారా అన్ని కమ్యూనిటీలను చేరుకోవచ్చని సీఎం యోగి చెబుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల మెరుగైన నిర్వహణ అన్ని కమ్యూనిటీలకు సహకరిస్తున్నదని తెలిపారు.
ఇటీవల విడుదలైన షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌లోని ‘బేషరమ్ రంగ్’ పాట వివాదం సందర్భంగా పఠాన్ మూవీ సహా పలు సినిమాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న బహిష్కరణ రాజకీయాలపై మాట్లాడుతూ కళాకారులు, పండితులందరినీ గౌరవించాలని, అయితే అదే సమయంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలను చిత్ర నిర్మాతలు పెట్టకూడదని యూపీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
ప్రభావం చూపని భారత్ జోడో యాత్ర
ఇక, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ఎలాంటి ప్రభావం చూపలేదని ఆదిత్యనాథ్ తేల్చివేసారు. దేశానికి విభజన రాజకీయాలను ఇచ్చిందని కాంగ్రెస్ అంటూ ఆ పార్టీ 1947 నుండి భారతదేశాన్ని విభజిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ తన ప్రతికూల వైఖరిని విడిచిపెట్టినట్లయితే, కాంగ్రెస్ లాభపడి ఉండేదని హితవు చెప్పారు.
మరోవైపు,గత నెలలో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత చెలరేగిన వివాదంపై ఆదిత్యనాథ్ మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ డిక్షనరీలో కృతజ్ఞత లేదని విచారం వ్యక్తం చేశారు. జోషిమఠ్ లో ఇళ్లు,రోడ్ల పగుళ్ల గురించి యాట్లాడిన సీఎం యోగి..అభివృద్ధి శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా లేకపోతే, అది పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ప్రకృతితో జోక్యం చేసుకోవడం వల్ల నివారించలేని విపత్తులు వస్తాయని తెలిపారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
ముగ్గురు సీనియర్ నేతలకు బిజెపి షోకాజ్ నోటీసులు