మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై సత్వరమే చర్యలు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు (డబ్లూఎఫ్‌ఐ) బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌‌పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. తాను ప్రస్తుతం ఢిల్లీకి వెళ్తున్నానని, రెజ్లర్లతో మాట్లాడతానని చెప్పారు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు నోటీసులు పంపామని, 72 గంటల్లోగా స్పందించాలని సూచించామని చెప్పారు. అదే సమయంలో త్వరలో జరగాల్సిన కీలక సమావేశాన్ని కూడా వాయిదా వేశామని అనురాగ్ తెలిపారు. మంత్రి నేటి ఉదయం వారి ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్,లు ఇందులో ఇద్దరు మహిళా సభ్యులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.

కాగా, మాజీ రెజ్లర్‌, బిజెపి నేత బబితా ఫొగాట్‌ ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా గురువారం ధర్నా ప్రాంతానికి వచ్చి మాజీ రెజ్లర్‌, బిజెపి నేత బబితా ఫొగాట్‌ ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా గురువారం ధర్నా ప్రాంతానికి వచ్చి రెజ్లర్లతో మాట్లాడారు. ”అథ్లెట్లకు ప్రభుత్వం మద్దతుగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా” అని తెలిపారు.

బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌ శరణ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా రెండో రోజు కూడా రెజ్లర్లు నిరసన దీక్ష కొనసాగించారు. అధ్యక్షుడిని వెంటనే తొలగించి, అన్ని రాష్ట్ర సంఘాలతో పాటు నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు బజ్‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌ పూనియా, వినేశ్‌‌‌‌‌‌‌‌ ఫోగట్‌‌‌‌‌‌‌‌, అన్షు, సాక్షి మాలిక్‌‌‌‌‌‌‌‌, ఆమె భర్త సత్యవ్రత్‌‌‌‌‌‌‌‌ కడియాన్‌‌‌‌‌‌‌‌తో సహా మరికొంత మంది రెజ్లర్లు  గురువారం స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సుజాత చతుర్వేది, సాయ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌ ప్రధాన్‌‌‌‌‌‌‌‌, జాయింట్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ కునాల్‌‌‌‌‌‌‌‌తో గంట పాటు చర్చలు జరిపారు.
 
అధ్యక్షుడినుంచి తమకు ఎదురైన అనుభవాలను, రెజ్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ముందు ఉంచారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అధ్యక్షుడిని వెంటనే తొలగించాలని రెజ్లర్ల బృందం డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసింది.  ఈ ధర్నాలో ఒలింపిక్‌ కాంస్య పతక విజేతలు సాక్షి మాలిక్‌, భజ్‌రంగ్‌ పూనియా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేతలు సరితా మోర్‌, సంగీతా ఫొగట్‌, సత్యవర్త్‌ మాలిక్‌, జితేందర్‌, సుమిత్‌ మాలిక్‌ సహా 30 మంది టాప్‌ రెజ్లర్లు పాల్గొన్నారు.

ఆరోపణలను కొట్టిపారేసిన బ్రీజ్ భూషణ్

మరోవైపు రెజ్లర్లు చేసిన ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ కొట్టిపారేశాడు. వినేశ్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాననడంలో కూడా వాస్తవం లేదని చెప్పారు. మహిళా రెజ్లర్లలో ఒక్కరినైనా లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకుంటానని స్పష్టం చేశారు. ‘ఇదంతా కుట్ర. ఓ పెద్ద పారిశ్రామికవేత్త వెనకుండి ఇదంతా నడిపిస్తున్నాడు. ఈసారి రెజ్లింగ్‌ సమాఖ్యలో కొత్త పాలసీ, నిబంధనలు ప్రవేశపెట్టాం. ఇవి వాళ్లకు నచ్చకపోవడంతో ఇలా ఆందోళన బాట పట్టారు’ అని బ్రిజ్‌ భూషణ్‌ ఆరోపించారు.

బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ ఎంపీ అయిన 66 ఏళ్ల బ్రిజ్‌ భూషణ్‌ 2011 నుంచి జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 ఫిబ్రవరిలో వరుసగా మూడోసారి భారత రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌గా ఎన్నికయ్యారు.