భారత్ లో రోహింగ్యాలను చేర్చుటకు అంతర్జాతీయ కుట్ర

కరణం భాస్కర్

డిసెంబర్ 9న బంగ్లాదేశ్ కాక్స్ బజార్ నుండి 167 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ లోని నదుల గుండా బంగాళాఖాతం ద్వారా ఒక పడవలో బయలుదేరి డిసెంబర్ 19-20 నాటికి ఖాళీగా ఉండే అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాలని వారి ప్రణాళిక.  ఈ సంవత్సరం జనవరి నుండి నవంబర్ వరకు 1900 మంది రోహింగ్యాలు అండమాన్ నికోబార్ దీవులలో స్థావరం ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నం చేశారు కానీ మన కోస్ట్ గార్డ్ బలగాలు వారి ఆటలు సాగనివ్వక అందరిని తరిమేసారు.
 
వారు బంగ్లాదేశ్ లో బయలుదేరేటప్పుడు ఒక పథకంతో, దిక్సూచి, సరంజామాతో ఆ దేశంలో ఉన్న మొహమ్మద్ రిజ్వాక్ ఖాన్ (వీరు అంతర్జాతీయ నాయకుడు)తో మాట్లాడే, ఒక ఫోన్ సదుపాయంతో సంబంధాలు పెట్టుకొని బయలుదేరుతున్నారు. 
మన దేశంలో అంతర్భాగమైన అండమాన్ నికోబార్ దీవులు 40 వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని దీవులలో మాత్రమే ఆదిమ జాతి మానవులు నివసిస్తుంటారు. కొన్ని దీవులలో మనుష్య సంచారమే ఉండదు. దీనిని అలుసుగా తీసుకొని రోహింగ్యాలు ఈ దీవులలో ప్రవేశించి స్థావరాలు ఏర్పాటు చేసుకొని, అక్కడున్న సారవంతమైన భూమిని వ్యవసాయం చేసుకొని, సముద్ర ఉత్పత్తులను సేకరించుకుని జీవించాలని ఓ పెద్ద ప్రణాళిక తయారు చేసుకొని వచ్చారు.
కానీ మన భద్రతా బలగాలు, కోస్ట్ గార్డ్ నావికా దళాలు దీనిని గమనించి నాలుగు బోట్లలో వారిని ముట్టడించి వారిని పంపించి వేశారు. ఎప్పుడైతే భారత్ బలగాలు వారిని వెంబడించి వారికి ఇక్కడ ఆశ్రయం కల్పించకుండా తరిమి వేస్తున్నారొ, ఈ మొహమ్మద్ రిజ్వాక్ ఖాన్ మన సంబంధిత నాయకులతో, అధికారులతో మాట్లాడి ఏదో ఒక రకంగా ఈ దీవుల్లో ఉండేటట్టుగా ఒత్తిడి తీసుకొచ్చారు.
చివరికి ఏమంటారంటే వారి బోటు ఇంజన్ చెడి పోయింది. కాబట్టి మీరు ఆశ్రయం కల్పించండి అని ఇతర ముస్లిం దేశాలలొని మీడియాలో వార్తలు ప్రసారం చేయడం, చెప్పించడం చేశారు. కానీ మన బలగాలు ససేమీరా అనేసరికి చివరకు ఇండోనేషియాకు వెళ్లారు .
అప్పటికే బయలుదేరిన 167 మందిలో పడవలో 20 మంది చనిపోయారు. అందులో ఒక 27 సంవత్సరాలు వయసు కలిగిన ఒక మహిళ ఐదు మంది పిల్లలతో అందులో ఉంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారి ఉద్దేశం. పడవకు చెడిపోయిన ఇంజనుతో మరి తిరిగి ఎలా వారు ఇండోనేషియాకు పోగలిగారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇండోనేషియా ముస్లిం దేశమైనప్పటికీ వీరిని ఆ దేశంలో డిటెన్షన్ జైల్లో మాత్రమే ఉంచారు.
 
దీనిని అంతర్జాతీయ విషయం చేసి వారికేదో భారతదేశంలో అన్యాయం జరిగిపోతుందని, వారికి మన దేశంలో స్థావరం కల్పించాలని ఇతర దేశాల నుండి వర్తమానాలు, యూ ఎన్ ఓ లో తీర్మానాలు చేసి అంతర్జాతీయంగా భారతదేశం మీద ఒత్తిడి చేయాలని ప్రయత్నం చేశారు. 
ఈ విషయం మన భారత పత్రికల్లో ఎక్కువగా రాలేదు కానీ కెనడా, ఐరోపా, అమెరికా దేశాల్లో అన్ని పేపర్లలలొ భారత్ మీద ఒత్తిడి తేవాలని ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఒక తీర్మానం చేసింది. దాని నెంబర్ 2668.ఆ తీర్మానంలో భారతదేశం బర్మా, మయన్మార్ కు చెందిన రోహింగ్యాలను భారతదేశంలో నివాసం కల్పించాలని కోరారు.
ఆ తీర్మానానికి భారత్ , రష్యా, చైనాలు ఓటు వేయలేదు. కానీ మిగతా 12 దేశాలు ఓటు వేసి తీర్మానాన్ని ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసాం కాబట్టి భారతదేశంలో రోహింగ్యాలను ఆశ్రయం కల్పించాలని ఒత్తిడి చేసింది. కానీ ఆ ఒత్తిడిని మన దేశం లెక్క పెట్టకుండా ఆ తీర్మానంలో మా సంతకం లేదని తిరస్కరించింది.
యుఎన్ఓ సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో తీర్మానం చేయదు గాని బర్మా, మయన్మార్ చెందిన రోహింగ్యాల విషయంలో మాత్రం తీర్మానం చేస్తుంది. ఇతర దేశాలలో ఉన్న హిందూ శరణార్థులను భారతదేశం కు తీసుకొని సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పిస్తామంటే వ్యతిరేకించే యుఎన్ఓ దీనికి మాత్రం వంత పాడుతుంది.
ఇప్పటికే భారతదేశంలో 40 నుండి 70 వేల వరకు రోహింగ్యాలు పశ్చిమబెంగాల్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్ లతో సహా వివిధ ప్రాంతాలలో ఉన్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది.  బోధన్ లొనైతే 200 దొంగ పాస్ పోర్టులను భారత్ నుండి సేకరించారని వెల్లడైంది.
వీరు ఒక పద్ధతి ప్రకారం అండమాన్ నికోబార్ దీవులలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని పెద్ద కుట్ర జరుగుతుంది. వీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు వారి ప్రయత్నాలు, అంతర్జాతీయంగా భారత వ్యతిరేక దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  ఇప్పటికే మన దేశంలో చేరిన రోహింగ్యాలు అడ్డదారుల్లో, దొడ్డిదారిన ఇక్కడ పాస్ పోర్టులు, ఓటర్ కార్డులు,ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు వంటి సదుపాయాలు చేయించుకున్నారని ఒక భోగట్ట. భారతీయ సమాజమంతా దీనిని తిప్పి కొట్టి భారత ప్రభుత్వానికి సహాయపడాలి.