2023లోనూ విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా భారత్ 

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మన దేశం 2023లోనూ విదేశీ పెట్టుబడులను ఆకర్షిణీయమైనదిగానే ఉంటుందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల మూలంగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, సప్లయ్‌ చైయిన్‌ సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేయడం సానుకూల అంశం. మన దేశంలో వ్యాపారం చేసేందుకు ఉన్న సానుకూల అంశాలు, సహజ వనరులు, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ఉదారవాద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం, దేశీయంగా అత్యంత భారీ మార్కెట్‌ వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్లు ఆకర్షిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మన దేశం 2022లో సంతృప్తికరమైన విదేశీ  ప్రత్యక్షట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను సాధించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022 జనవరి-సెప్టెంబర్‌ కాలంలో 42.5 బిలియన్‌ విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశానికి వచ్చాయి. 2021లో ఇదే కాలంలో 51.3 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2021-22 పూర్తి సంవత్సరంలో మన దేశంలోకి 84.84 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.

మన దేశ ఈక్విటీ మార్కెట్‌లోకి ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌- సెప్టెంబర్‌ కాలంలో 14శాతం తగ్గి 26.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు 39 బిలియన్లకు క్షిణించాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 42.86 బిలియన్లుగా ఉన్నాయి.

మన దేశం ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమల ప్రోత్సహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ చెప్పారు. ఎఫ్‌డీఐ విధానంలో సరళీకరణ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను మరింత ప్రోత్సహించడం, పరిశ్రమలపై చట్టపరమైన భారాలు, అడ్డకుంకులు లేకుండా చర్యలు తీసుకోవడం, ఉత్పత్తిని పెంచేందుకు పీఎల్‌ఐ స్కీమ్‌ అమలు, సమగ్ర మౌలిక సదుపాయల కల్పనకు పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయడం వంటి చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.

గత ఎనిమితి సంవత్సరాలుగా మన దేశంలోకి రికార్డ్‌ స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయని చెప్పారు. మందగించిన ఆర్ధిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి సవాళ్లను పరిగణలోకి తీసుకుంటే వచ్చే సంవత్సరంలో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మన దేశం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోతసహాకం (పీఎల్‌ఐ) వల్ల ప్రపంచ స్థాయి సంస్థలు అనేకం మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. ఈ సంస్థలు, కంపెనీలు తయారీని మన దేశానికి మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

నేషనల్‌ సింగిల్‌ విండో విధానం (ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్‌) అభివృద్ధి చెయడంతో వ్యాపారాల అనుమతులు పొందడం తేలిక చేసింది. ఇది ఎక్కువ పెట్టుబడులు మన దేశానికి వచ్చేందుకు సహాయ పడుతుంది. ఈ ఆర్ధిక సంవత్సరం ఆస్ట్రేలియా, యూఏఈతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు 2023-24లో మన దేశానికి మరిన్ని పెట్టుబుడలు వచ్చేందుకు దోహదం చేయనుంది.

మన దేశంలోకి 2000 సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ 2022 వరకు 887.76 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 26 శాతం ఎఫ్‌డీఐలు మారిషస్‌ మార్గం ద్వారా వచ్చినవే. 

 దీని తరువాత స్థానం 23 శాతంతో సింగపూర్‌ , అమెరికాజ నుంచి 9 శాతం, నెదర్లాండ్స్‌ నుంచి 7 శాతం, జపాన్‌ నుంచి 6 శాతం, బ్రిటన్‌ నుంచి 5 శాతం ఉన్నాయి. యుఏఈ, జర్మనీ, సైప్రస్‌, కేమన్‌ దీవుల నుంచి ఒక్కోక్క దేశం నుంచి 2 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి.