దేశీయ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల లోపు ఉండే రిటైల్ డిపాజిటర్లతో పాటు రూ.2 కోట్ల పైన ఉండే బల్క్ డిపాజిట్లపై ఎంపిక చేసిన మెచ్యూరిటీ టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు మే 15, 2024 బుధవారం నుంచే అమలులోకి వచ్చినట్లు తమ అధికారిక వెబ్‌సైట్ లో పేర్కొంది
రూ.2 కోట్ల లోపు ఉండే డిపాజిట్లపై
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రూ.2 కోట్ల లోపు ఉండే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. అందులో 46 రోజుల నుంచి 179 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ ఉండే డిపాజిట్లపై అత్యధికంగా 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ పెంచింది. దీంతో జనరల్ కస్టమర్లకు 4.75 శాతం నుంచి 5.50 శాతానికి వడ్డీ రేటును పెంచినట్లయింది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ టెన్యూర్ పై 5.25 శాతం నుంచి 6 శాతానికి వడ్డీ పెంచింది.
- అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల వడ్డీ పెంచింది. దీంతో జనరల్ కస్టమర్లు ఈ టెన్యూర్ పై ప్రస్తుతం ఉన్న 5.75 శాతం వడ్డీ రేటును 6 శాతానికి పెంచినట్లయింది.
- మరోవైపు.. 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఉండే డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ పెంచింది. దీంతో జనరల్ కస్టమర్లకు ఈ టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. ఇక సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగింది.
రూ.2 కోట్ల పైన ఉండే బల్క్ డిపాజిట్లపై
- 7 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్ గల రూ.2 కోట్లపై చిలుకు డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ 5 శాతం నుంచి 5.25 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఇప్పుడు 5.75 శాతం మేర వడ్డీ కల్పిస్తోంది.
- అలాగే 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ పై బల్క్ డిపాజిట్లకు జనరల్ కస్టమర్లకు 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.75 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం నుంచి 6.75 శాతానికి వడ్డీ రేట్లు పెరిగాయి.
- 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్ బల్క్ ఎఫ్‌డీ పై జనరల్ కస్టమర్లకు 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కొత్త వడ్డీ రేట్లు 6.60 శాతానికి పెరిగాయి. సీనియర్లకు 7.10 శాతం వడ్డీ ఇస్తోంది.
- ఏడాది నుంచి 2 ఏళ్లలోపు డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో జనరల్ కస్టమర్లకు వడ్డీ రేటు 6.80 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.
- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.75 శాతం నుంచి 7 శాతానికి చేర్చింది. సీనియర్లకు 7.25 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది.
More Stories
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం