మోదీ ప్రభుత్వం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణపై దృష్టి 

మోదీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిన రంగాల్లో ఆరోగ్య సంరక్షణ ఒకటి అని కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణకు విధానం అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం  అనారోగ్యానికి కారణమయ్యే కారకాలను తొలగించడం, వ్యాధుల చికిత్స ను సమ్మిళితం చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు స్వస్థత పై  దృష్టి సారించిందని  పేర్కొన్నారు. 

గత 7-8 ఏళ్లలో భారతదేశంలో ఆరోగ్య రంగంలో జరిగిన  పని గత 70 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.  ప్రజలందరికి సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి  గత 8 సంవత్సరాల కాలంలో  ఆరోగ్య రంగంలో  మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని  సింధియా చెప్పారు.

ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని  చెబుతూ సరసమైన ధరకు చికిత్స, ఔషధాలు అందించడం,  గ్రామ స్థాయిలో ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అభివృద్ధి చేయడం, మానవ వనరుల అభివృద్ధి, వ్యాధి  నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రోత్సహించడం,  ఆరోగ్య సంరక్షణ అందించడానికి  పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వివరించారు.

ఆరోగ్య సంరక్షణలో ‘అంత్యోదయ’ దార్శనికతను అమలు చేయడం ద్వారా మోదీ  ప్రభుత్వం నాణ్యమైన అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సరసమైన ధరలకు మందులు అందుబాటులోకి తెచ్చిందని  సింధియా  తెలిపారు. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా అమలు జరుగుతున్న  ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పి ఎం-జె) ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందిందని చెప్పారు.

పథకం అమలుకు కేంద్ర  ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తుందని చెబుతూ పీఎంజే  కింద సుమారు 10.74 కోట్ల పేద, నిస్సహాయ కుటుంబాలు (సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారులు) ద్వితీయ, తృతీయ స్థాయి ఆసుపత్రుల్లో చేరే సమయంలో ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో 17.6 కోట్ల  ఆయుష్మాన్ కార్డులు మంజూరు అయ్యాయని   సింధియా తెలిపారు. 

ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు  28,800కి పైగా ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించామని  ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎం బిజెపి) పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 8,800 జన ఔషధి ఫార్మసీ అవుట్ కేంద్రాల్లో  1,800 కంటే ఎక్కువ మందులు సరసమైన, అధిక నాణ్యత గల  అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. 

ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకు రావడానికి చర్యలు అమలు చేస్తున్నాదని సింధియా తెలిపారు. దీనిలో భాగంగా స్థిరమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించడానికి  ఆయుష్మాన్ భారత్ హెల్త్ , వెల్ నెస్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయని  చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అందించేందుకు  గ్రామాల్లో పరీక్షల కోసం మెరుగైన సౌకర్యాలతో పరీక్ష కేంద్రాలు నెలకొల్పి  సకాలంలో చికిత్స కోసం వ్యాధులను గుర్తిస్తున్నారని మంత్రి తెలిపారు. 

2014కు ముందు దేశంలో 400 కంటే తక్కువ వైద్య కళాశాలలు ఉండేవని, గత ఎనిమిదేళ్లలో 200కు పైగా కొత్త  వైద్య కళాశాలలు నెలకొల్పామని చెప్పారు. వైద్య విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తున్నదని తెలిపారు. దేశంలో  2014 కి ముందు ఏడు ఎయిమ్స్  మాత్రమే ఉన్నాయని తెలిపిన మంత్రి కేంద్ర ప్రభుత్వ పథకం కింద 22 కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు ఎయిమ్స్ ఆమోదం లభించిందని వెల్లడించారు. 

యోగా, ఆయుష్ పై ప్రజలకు  అవగాహన ఎక్కువగా ఉందని మంత్రి తెలియజేశారు. ప్రపంచంలో యోగా పట్ల ఆకర్షణ పెరిగిందని చెబుతూ  స్వచ్ఛ భారత్ అభియాన్ అనేక వ్యాధుల నివారణకు సహకరించిందని  చెప్పారు.   పోషణ్ అభియాన్, జల్ జీవన్ మిషన్ పోషకాహార లోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతున్నాయని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా నగరాల వైద్యుల నుంచి ప్రాథమిక సంప్రదింపులు పొందగలుగుతున్నారని సింధియా తెలిపారు. నేషనల్ టెలిమెడిసిన్ సర్వీస్ – ఇ సంజీవని వ్యాధుల నిర్ధారణ, చికిత్స, నిర్వహణ రిమోట్ గా ప్రారంభించడానికి ఐసిటి ని వినియోగిస్తున్నదని  సింధియా వివరించారు. సమగ్ర డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించిందని సింధియా తెలిపారు.