ఇప్పటివరకూ పనిచేసే చోట చాలామంది శారీరక, లైంగిక వేధింపులు ఎదుర్కొవటం గురించి విన్నాం. అయితే, ఈమధ్య కాలంలో పని ప్రదేశాల్లో మానసిక హింస, వేధింపులు ఎక్కువయ్యాయని గ్లోబల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వే వివరాలను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ, లల్లాయిడ్ రైట్స్ ఫౌండేషన్, గాల్లప్ సంస్థ విడుదల చేశాయి.
ఆఫీస్, పనిచేసే చోట ఎదురయ్యే వేధింపులలో మానసిక హింస శాతం ఎక్కువని ఈసర్వేలో చాలామంది ఉద్యోగులు చెప్పారు. మహిళా ఉద్యోగులు మాత్రమే కాదు మగవాళ్లు కూడా ఈ సమస్య ఎదుర్కొన్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 17.9 శాతం మంది ఉద్యోగులు మానసిక హింసకు గురయ్యామని వెల్లడించారు.
8.5శాతం మంది తాము పని ప్రదేశంలో శారీరక హింసను అనుభవించామని, 6.3 శాతం మంది లైగింక వేదింపుల బారిన పడ్డట్టు చెప్పుకొచ్చారు. పోయిన ఏడాది 121 దేశాల్లో సైకలాజికల్ వయొలెన్స్ గురించి 75,000 మందిపై సర్వే చేశారు. దాదాపు 22 శాతం మంది ఏదో ఒక రూపంలో హింసకు గురైనట్టు తెలిపారు.
ఆఫీసులో, కంపెనీలో చాలాసార్లు మానసిక వేధింపులు ఎదుర్కొన్నామని, మానసిక హింసకు గురి అయి దాదాపు ఐదేళ్లు కావొస్తుంది అని మానసిక వేధింపుకుల గురైనవాళ్లలో దాదాపు 60 శాతం మంది చెప్పారు.
‘పనిప్రదేశాల్లో మానసిక హింస అనేది ఈమధ్య ఎక్కువైంది. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. చాలామంది ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు వాళ్ల కెరీర్ నాశనం అవుతుంది. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు’ అని యూఎన్ లేబర్ ఆర్గనైజేషన్ తెలిపింది. పని ప్రదేశాల్లో సైకలాజికల్ వయొలెన్స్, హరాస్‌మెంట్ మీద ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేయడం ఇదే మొదటిసారి.
More Stories
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష