ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమాస్తులపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం

తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నెంబర్ 1 అవినీతిపరుడని చంపాపేట్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ అరోపించారు. సుధీర్ రెడ్డి అవినీతిపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అతని అక్రమాలపై ఏసీబీ, సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరతామని చెప్పారు.

కార్పొరేటర్లు తెచ్చిన నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్యెల్యే శంకుస్థాపనలు చేస్తూ సన్మానాలు చేయించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమ సంపాదన దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగా ఉంటుందని బీజేపీ కార్పొరేటర్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన సుధీర్ రెడ్డి అధికార దర్పంతో భూములను కబ్జాలు చేసి, కోట్లు సంపాదించారని విమర్శించారు.

కార్పొరేటర్, హుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టక ముందు సుధీర్ రెడ్డి ఉన్న ఆస్తులెన్.? రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆస్తుల విలువ ఎంతో సుధీర్ రెడ్డి చెప్పాలని డిమాండ్చేశారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని వంగ మధుసూదన్ సవాల్ విసిరారు. సుధీర్ రెడ్డి అవినీతి బాగోతాన్ని బయటపెట్, రాబోయే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు.