రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, హైదరాబాద్- యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులున ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా నరేంద్ర మోదీ మే నెల 10వ తేదీ, ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణకు రానున్నట్లు ఆయన చెప్పారు.
కాగా, తార్నాక ప్రాంతంలో సుమారు రూ.400 కోట్లతో నేషనల్ సైన్స్ సెంటర్ నిర్మాణం కొనసాగుతోందని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్లను పరిశీలించి ఆమోదించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగానికి సంబంధించిన డిపిఆర్ పనులు కొనసాగుతున్నాయని, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేస్తుండగా, అందులో తెలంగాణలోని జహీరాబాద్‌కు ఒకటి కేటాయించామని గుర్తు చేశారు.

More Stories
దేశానికే ‘దిక్సూచి’ హైదరాబాద్ పోలీసుల ‘ఆపరేషన్ ఆక్టోపస్’
మట్టిలో మాణిక్యం… స్టేట్ థర్డ్ ర్యాంకర్
ఎంఎంటీఎస్ రైళ్లలో జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం