” నేను పిల్లలపై దుర్వినియోగానికి సంబంధించిన క్రిమినల్ అశ్లీలత గురించి మాట్లాడటం లేదు. అది ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నది. అయితే పోర్నోగ్రఫీ కొంచెం ‘సాధారణం’గా మారుతున్నది.ప్రియమైన సహోదరులారా, దీని గురించి జాగ్రత్తగా ఉండండి,” అని రోమ్‌లో జరిగిన సమావేశంలో సెమినార్లను ఆయన హెచ్చరించారు. ఇటువంటి దురలవాటు వారి హృదయాలను బలహీన పరుస్తుందని ఆయన వారించారు.
ప్రముఖంగా సహనశీలి అయిన 85 ఏళ్ల పోప్‌ను భక్తులు సెల్‌ఫోన్‌ల వంటి ఆధునిక ప్రపంచంలోని సాంకేతికతలను ఉపయోగించాలా? అని చర్చి విద్యార్థి ఒకరు అడగడంతో ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “మీరు వాటిని ఉపయోగించాలి, మీరు వాటిని సహాయంగా, కమ్యూనికేట్ చేయడానికిఅదే మాత్రమే ఉపయోగించాలి. అదే మంచిది” అని పోప్ స్పష్టం చేశారు.
“మీకు బాగా తెలిసిన మరో విషయం ఉంది: డిజిటల్ పోర్నోగ్రఫీ. నేను దాని గురించి వారిస్తున్నాను” అంటూ “ప్రతిరోజు యేసును స్వీకరించే స్వచ్ఛమైన హృదయం ఈ అశ్లీల సమాచారాన్ని అందుకోదు. ఈ రోజు, మీరు దీన్ని మీ మొబైల్ ఫోన్ నుండి తొలగించగలిగితే, దాన్ని తొలగించండి” అంటూ హితవు చెప్పారు. సోషల్ మీడియా కోసం ఎక్కువగా సమయం వృద్దా చేయవద్దని వారికి సూచించారు.
గత సంవత్సరం, ఫ్రాన్సిస్ ఏడు ఘోరమైన పాపాలలో కామం చెత్త కాదు అని ప్రకటించారు. డిసెంబర్, 2021లో వివాహం వెలుపల సెక్స్ గురించి మాట్లాడుతూ శరీరంకు సంబంధించిన పాపాలు చాలా తీవ్రమైనవి కావని చెప్పారు.
తాను ఆలస్యంగా ఉపయోగించడం ప్రారంభించడంతో 64.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, తాను ట్విట్టర్‌లో యాక్టివ్ యూజర్ కాదని పోప్ చెప్పారు. వ్యక్తుల బృందం ఆయన పేరుతో ఉన్న వివిధ సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తుంది.2020 చివరలో, పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్రెజిలియన్ మోడల్ నటాలియా గారిబోట్టో ఫోటోను `లైక్’ చేయడం, తర్వాత సోషల్ మీడియా యాప్ నుండి వివరణలు కోరడంతో వాటికన్ బృందం ఇరకాటంలో పడింది.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!
అంతరిక్షం నుంచి మహా కుంభ మేళా.. ఇస్రో ఫొటోలు