ఈశాన్య భారత్ అభివృద్ధికి రూ. 600 కోట్లతో ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం  రోజు 2022-23 నుండి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం మిగిలిన నాలుగు సంవత్సరాలకు ఈశాన్య ప్రాంత అభివృద్ధికి 100 శాతం కేంద్ర నిధులు లభించే రూ 600 కోట్ల ప్రత్యేక కేంద్ర పధకాన్ని ఆమోదించింది.   పిఎం-డిఈవిఐఎన్‌ఈ ప్రాజెక్ట్‌లను 2025-26 నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి.
తద్వారా ఈ సంవత్సరానికి మించి ఎటువంటి కట్టుబడి బాధ్యతలు ఉండవు. ఇది ప్రాథమికంగా 2022-23, 2023-24లలో పథకం కింద ఆంక్షల ముందు లోడింగ్‌ను సూచిస్తుంది. 2024-25, 2025-26లలో ఖర్చులు కొనసాగుతుండగా మంజూరైన పిఎం-డిఈవిఐఎన్‌ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తారు.

ఈ పధకం మౌలిక సదుపాయాల కల్పన, మద్దతు పరిశ్రమలు, సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులు, యువత మరియు మహిళలకు జీవనోపాధి కార్యకలాపాలను సృష్టిస్తుంది. తద్వారా అది ఉపాధి కల్పనకు దారి తీస్తుంది. పిఎం-డిఈవిఐఎన్‌ఈని నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ లేదా సెంట్రల్ మినిస్ట్రీలు/ఏజెన్సీల ద్వారా డోనర్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది.
 
 పిఎం-డిఈవిఐఎన్‌ఈ కింద మంజూరైన ప్రాజెక్ట్‌లు స్థిరంగా ఉండేలా వాటికి తగిన నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకుంటారు. సమయం, అధిక వ్యయంతో కూడిన నిర్మాణ ప్రమాదాలను పరిమితం చేయడానికి సాధ్యమైనంత వరకు ఇంజినీరింగ్-ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్ (ఈపీసి) ప్రాతిపదికన అమలు చేస్తారు.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ  లక్ష్యాలు:

(ఎ) ప్రధానమంత్రి గతి శక్తి స్ఫూర్తితో మౌలిక సదుపాయాలకు సమయోచితంగా నిధులను సమకూర్చడం;
(బి) ఎన్‌ఈఆర్‌ అవసరాల ఆధారంగా సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు;
(సి) యువత,  మహిళల జీవనోపాధి కార్యకలాపాలను మెరుగుపరచడం
(డి) వివిధ రంగాలలో అభివృద్ధి అంతరాలను పూరించడం.

ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఇతర ఎండిఓఎన్‌ఈఆర్‌ పథకాలు పథకాలు కూడా ఉన్నాయి. ఎండిఓఎన్‌ఈఆర్‌  పథకాల కింద ప్రాజెక్ట్‌ల సగటు పరిమాణం దాదాపు రూ.12 కోట్లు మాత్రమే. పిఎం-డిఈవిఐఎన్‌ఈ ఇతర సామాజిక అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు మద్దతునిస్తుంది. అవి పరిమాణంలో పెద్దవిగా ఉండవచ్చు . 

 
 వివిధ ప్రాజెక్ట్‌లకు బదులుగా ఎండ్-టు-ఎండ్ డెవలప్‌మెంట్ సొల్యూషన్‌ను కూడా అందిస్తుంది. ఈశాన్య ప్రాంతంలో  అభివృద్ధి అంతరాలను తొలగించడానికి కేంద్ర బడ్జెట్ 2022-23లో పిఎం-డిఈవిఐఎన్‌ఈ  ప్రకటించారు.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ కింద 2022-23కి ఆమోదించిన కొన్ని ప్రాజెక్ట్‌లు బడ్జెట్ ప్రకటనలో భాగం. గణనీయమైన సామాజిక ఆర్థిక ప్రభావం లేదా సాధారణ ప్రజలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్ట్‌లు (ఉదా అన్ని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సమగ్ర సౌకర్యాలు మొదలైనవి) భవిష్యత్తులో పరిగణించవచ్చు.

పిఎం-డిఈవిఐఎన్‌ఈ  ప్రకటనకు సమర్థన ఏమిటంటే ప్రాథమిక కనీస సేవల (బిఎంఎస్)కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల పారామితులు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 
 
నీతి ఆయోగ్, యుఎన్‌డిపి, ఎండిఓఎన్‌ఈఆర్‌ రూపొందించిన బిఈఆర్ డిస్ట్రిక్ట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోడ్ (ఎస్‌డిజి) ఇండెక్స్ 2021-22 ప్రకారం క్లిష్టమైన అభివృద్ధి అంతరాలు ఉన్నాయి. ఈ బిఎంఎస్‌ లోటుపాట్లు, అభివృద్ధి అంతరాలను నివారించడానికి ఈ కొత్త పథకం పిఎం-డిఈవిఐఎన్‌ఈ ప్రకటించారు.