ఆచార్య స్వామి ధర్మేంద్ర మహారాజ్ మృతి

గుజరాత్ లోని శ్రీ పంచఖండ పీఠాధీశ్వర్ ఆచార్య స్వామి ధర్మేంద్ర మహారాజ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం జైపూర్ లో ఆయన వయసు 80. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక వహించిన ఆయన సుదీర్ఘకాలం విశ్వ హిందూ పరిషత్‌తో కలసి పనిచేశారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.
 
ఆచార్య స్వామి ధర్మేంద్ర మరణ వార్త తెలియగానే పలు హిందూ సంస్థల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. జైపూర్ లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్ వర్గాల ప్రకారం, ఆచార్య ఆగస్టు 28 నుండి జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ‘వెంటిలేటర్ సపోర్ట్’పై ఉంచారు. చివరికి ఈ రోజు ఉదయం మరణించారు.
 
ఆయన జనవరి 9, 1942న గుజరాత్‌లోని మాల్వాడలో జన్మించారు. బాబ్రీ కూల్చివేత కేసులో ఆచార్య ధర్మేంద్ర, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమాభారతిలను నిందితులుగా పరిగణించారు. మహాత్మా రామచంద్ర వీర్ మహారాజ్ కుమారుడు ఆచార్య ధర్మేంద్ర, ఆయన తన జీవితమంతా హిందీ, హిందుత్వ, హిందుస్థాన్‌ల పురోగతికి అంకితం చేశారు. గోవుల సంక్షేమం కోసం ఒకసారి 52 రోజుల పాటు ఉపవాసం కూడా చేశారు. ఆవేశపూరిత ప్రసంగాలకు ప్రసిద్ధి చెందిన హిందూ నాయకుడు.
 
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతూ శ్రీమద్ పంచఖండ పీఠాధీశ్వర్ ఆచార్య ధర్మేంద్ర జీ మరణం సనాతన ధర్మానికి తీరని లోటు అని ట్వీట్ చేశారు. ఆచార్య ధర్మేంద్ర జీ జీవితమంతా సనాతన్ హిందూ ధర్మానికి అంకితం అని ఆయన కొనియాడారు. గోసంరక్షణ ఉద్యమానికి శ్రీరామ జన్మభూమికి ఆచార్య చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
 
ఆయన మరణం సమాజానికి తీరని లోటు అంటూ శ్రీరాముడి ఆత్మకు ఆయన పాదాల చెంత చోటు కల్పించాలని, ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, భక్తులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు  ఆదిత్యనాథ్ తెలిపారు. ఆచార్య తన 13 సంవత్సరాల వయస్సులో వజ్రంగ్ వార్తాపత్రికను స్థాపించారు. విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ మార్గదర్శక మండలిలో పనిచేశారు.
 
ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ సంతాపం
 
ఆచార్య ధర్మేంద్రజీ మృతితో హిందూ సమాజం తన స్పూర్తిదాయకమైన ప్రతినిధిని,  హిందూ ధర్మం, సంస్కృతిల క అప్రమత్తమైన ఎధులలో ఒకరిని కోల్పోయిందని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హాసభలే సంతాపం ప్రకటించారు. ఆయన మృతి చెందిన కుటుంబ సభ్యులకు, అనుచరులకు, అభిమానులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
శ్రీ రామ జన్మభూమి ఆలయ ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా ఆచార్యజీ చేపట్టిన హిందూత్వ మేల్కొలుపు మిషన్ ఎప్పటికీ గౌరవప్రదంగా గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సర్వోన్నతుడు ఆచార్య నిష్క్రమించిన ఆత్మను తన పవిత్ర పాదాల వద్ద ఉంచగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.

“ఆచార్య ధర్మేంద్రజి మహారాజ్ శ్రీరామజన్మభూమి ఆందోళనలో అగ్రగామిగా నిలిచి దేశవ్యాప్తంగా పర్యటన చేసి అద్భుతమైన తన ప్రసంగాలతో హిందూ సమాజాన్ని తట్టి లేపారు” అంటూ ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలకే బిర్లా దక్షిణ మూర్తి సంతాపం తెలిపారు.
 
“తెలుగు ప్రాంతాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా పర్యటించారు. శ్రీ సింఘాల్ జి అయోధ్య తీర్పును చూడలేకపోయారు. కానీ ధర్మేంద్రజీ మహారాజ్ ఆ ఆనందకరమైన వేళలో జీవించి ఉన్న మహాపురుషుడు శివైక్యం చెందిన మహానుభావునికి శత సత్తా శ్రద్ధాంజలులు” అని నివాళులు అర్పించారు.
 
ఎంతో దూకుడుగా, సాహసంతో ఉద్యమాలు చేపట్టిన హిందూ సాధువులలో ఆచార్య ధర్మేంద్రజీ ఒకరని అంటూ ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ నివాళులు ఆరోపించారు. ఆయన ప్రసంగాలు తొంభైలలో యువ తరానికి ఎంతో స్ఫూర్తి కలిగించాయని చెబుతూ భైంసా పట్టణంలో హిందూ సమాజం ఆచార్య ధర్మేంద్రజీ రౌద్ర స్వరూపాన్ని చూసిన చిరస్మరణీయ సన్నివేశాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. ఆ సమావేశంలో ఉన్నందున, నవ భారత యోధుడైన ఈ సన్యాసిని తాను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని చెప్పారు.
 
రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా అయన మృతికి సంతాపం తెలిపారు. ఈ దుఃఖ సమయంలో స్వామిజి  ఆత్మకు శాంతి చేకూరాలని, మృతుని కుటుంబాలకు బలం చేకూరాలని ప్రార్థించారు. ”’శ్రీరాముని భక్తుడైన ఆచార్య ధర్మేంద్ర జీ మహారాజ్ స్వర్గలోకానికి బయలుదేరారు. రామ మందిర నిర్మాణ ఉద్యమంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇది మొత్తం సమాజానికి తీరని లోటు’ అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేశారు.