తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ (ఎన్ఐఎ) సోదాలు నిర్వహిస్తున్నది. నిజామాబాద్, నిర్మల్‌, జగిత్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కేసులో నిందితులు, అనుమాతుల ఇండ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 చోట్ల, నిర్మాల్‌ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలో, జగిత్యాలలోని టవర్‌ సర్కిల్‌లో ఉన్న కేర్‌ మెడికల్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. పాపులర్‌ ఫ్రంట్‌ కార్యకలాపాలపై ఆరాతీస్తున్నారు.

ఇక ఏపీలోని కర్నూలు, కడప జిల్లాల్లో 23 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఇప్పటికే పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా ఇమ్రాన్, అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

వీరిపై పోలీసులు దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మతకలహాలు సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఏ ఆరా తీస్తున్నది.