* రైతుల పక్షాన నిలిచిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, రైతు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించేందుకు బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్రవ్యాప్తంగా “రైతు గోస – బీజేపీ భరోసా” కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత నాలుగు రోజులుగా బీజేపీ ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆవేదనను దగ్గరుండి వింటున్నారు.

అందులో భాగంగానే గురువారం నిర్మల్ జిల్లాలోని కడెం, ఖానాపూర్, మామడ, సోన్, దిలావర్ పూర్ మరియు సారంగాపూర్ మండలాల్లో ఈ పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా భారీగా నిల్వ ఉందని, అధికారులు చెబుతున్న 80% కొనుగోలు అనేది అబద్ధమని విమర్శించారు. రైతుల కష్టాలను ఏసీ రూముల్లో కూర్చుని కాకుండా, క్షేత్రస్థాయిలో చూడాలని ముఖ్యమంత్రికి సవాలు విసిరారు.
సంచులు లేకపోవడం, హమాలీ చార్జీలు, రవాణా ఖర్చులను రైతులపైనే రుద్దడం అన్యాయమని, చివరి గింజ కొనే వరకు బీజేపీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన లారీలను పెంచి, వర్షాకాలం రాకముందే ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.
ఎంపీ ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, రైతుల ఉసురు పోసుకుంటుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేము ఓటు వేస్తేనే మీరు సీఎం అయ్యారు” అని రైతులు ఆవేదన చెందుతున్నారని గుర్తు చేశారు. భూయజమానుల థంబ్ ఇంప్రెషన్ వంటి మూర్ఖపు నిబంధనలతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో రైతు ఒక పక్క ఎండలకు, మరోపక్క ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్నాడని, ఇటువంటి దుర్మార్గాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను పకడ్బందీగా చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక, అమ్ముకోలేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వడ్లు మాత్రమే కాకుండా, అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అలా చేయలేని పక్షంలో రైతులకు కనీస మద్దతు ధరకు గ్యారెంటీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా రైతుల సమస్యలపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తామని, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు బీజేపీ నేతలు రైతుల వెంటే ఉంటారని నాయకులు స్పష్టం చేశారు.

More Stories
కాజీపేట రైల్వే యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం
కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్ర వల్లే అన్నదాతల కన్నీరు