త్రిపురలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తాం!

రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో మెజారిటీ గెలుస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అగర్తలాలో విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో ప్రభుత్వ పనితీరు ఆధారంగా ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.

త్రిపురలో రెండు రోజుల పర్యటనలో ఉన్న బిజెపి అధ్యక్షుడు ఆదివారం రాష్ట్ర పార్టీ ఆఫీస్ బేరర్లు, ఎమ్మెల్యేలు, గిరిజన మండలి సభ్యులు, తన పార్టీ గిరిజన నాయకులు, మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి)తో వరుస సమావేశాలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం త్రిపుర ఎడిసి ప్రధాన కార్యాలయం ఖుముల్‌ంగ్‌లో బహిరంగ సభలో ప్రసంగించడమే కాకుండా, మీడియాతో కూడా మాట్లాడారు.

“మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందనే నమ్మకం ఉంది… పూర్తి స్థాయి మెజారిటీ, మేము సరిగ్గా పని చేస్తాము.” నడ్డా మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలతో – రాష్ట్ర నాయకుల నుండి అనుబంధ విభాగాల అధినేతల వరకు తాను చర్చలు జరిపినట్లు చెప్పారు. .

“బిజెపి పూర్తి బలంతో తిరిగి అధికారంలోకి వస్తుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో శాంతి, అభివృద్ధిని అందించడానికి కృషి చేస్తుంది. పార్టీకి, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది.  రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి అవకాశాన్ని వదులుకోము”  అంటూ భరోసా వ్యక్తం చేశారు.

త్రిపురలో నాలుగు సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెబుతూ 1988 వరకు మాజీ ముఖ్యమంత్రి నృపేన్ చక్రవర్తి హయాంలో 10 సంవత్సరాలు, అంతకు ముందు మాజీ సిఎంలు దశరథ్ దేవ్, మాణిక్ సర్కార్ హయాంలో 25 సంవత్సరాల పాటు ఇక్కడ సాగిన వామపక్ష పాలన “నీడలు” ఇంకా వెంటాడుతున్నాయని నడ్డా తెలిపారు. 


“35 ఏళ్ల వామపక్ష ప్రభుత్వ ఛాయలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మహిళా సాధికారత కోసం వారు ఏమీ చేయలేదు. యువకులు దోపిడీకి గురయ్యారు, గిరిజనులు విస్మరించబడ్డారు” అని విమర్శించారు, 1988 నుండి 1993 మధ్య త్రిపురను పాలించిన కాంగ్రెస్-త్రిపుర ఉపజాతి జుబా సమితి (టియుజెఎస్) కూటమి ప్రభుత్వం తీవ్రవాదం, చొరబాట్లను ప్రోత్సహించిందని ధ్వజమెత్తారు.

బీజేపీ పాలనలో కనెక్టివిటీ మెరుగుపడిందని, త్రిపుర ఆగ్నేయాసియా దేశాలకు అంతర్జాతీయ గేట్‌వే పాత్రను పోషించడం ప్రారంభించిందని నడ్డా గుర్తు చేశారు. మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, విద్యలో పురోగతిని ఉటంకిస్తూ, బిజెపి ఆధ్వర్యంలో త్రిపుర తలసరి ఆదాయంలో 30 శాతం వృద్ధిని సాధించిందని చెప్పారు.  ఇప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం సంవత్సరానికి రూ. 1.30 లక్షలుగా ఉందని నడ్డా తెలిపారు.


గిరిజనుల అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహాయంతో రాష్ట్రంలోని వివిధ స్థానిక వర్గాల కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి, జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి రూ 1,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని నడ్డా గుర్తు చేశారు.