చైనా గూఢచర్య నౌక శ్రీలంకకు రావడం వెనుక మాజీ సైనికాధికారి!

శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయంలోకి చైనీస్ గూఢచర్య నౌక రావడం వెనుక శ్రీలంక నావికా దళం మాజీ అధిపతి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర సంబంధిత పరిశోధనల నెపంతో ఈ నౌకను చైనా  ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ నౌకను అనుమతించవద్దని భారత దేశం అనేకసార్లు అభ్యంతరం తెలిపినప్పటికీ శ్రీలంక పట్టించుకోలేదు.
శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయాన్ని చైనాకు 99 సంవత్సరాలకు కౌలుకు ఇచ్చారు. ఇక్కడికి యువాన్ వాంగ్ 5 మంగళవారం ఉదయం 4.00 గంటలకు చేరుకుంది. ఇది ఈ నౌకాశ్రయంలో ఆగస్టు 21 వరకు ఉంటుందని చెప్తున్నారు.  ఇది ఉపగ్రహ సమాచారంతో, బ్యాలిస్టిక్ క్షిపణుల జాడను గుర్తించే వ్యూహాత్మక నౌక. అయితే ఇది మెరైన్ సైంటిఫిక్ రీసెర్చ్ నౌక అని చైనా చెప్తోంది.  ఈ నౌక ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ నౌకాశ్రయంలో ఉంటుందని మొదట్లో ప్రకటించారు.
అయితే మరిన్ని చర్చలు అవసరమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం చెప్పింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. దివాలా తీసిన శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రుణాలను అడ్డుకుంటామని చైనా హెచ్చరించడంతో శ్రీలంక తలొగ్గక తప్పలేదు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ గూఢచర్య నౌక రాకను విక్రమసింఘే ప్రభుత్వం వాయిదా వేయడంపై శ్రీలంక మాజీ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి, మాజీ నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సరత్ వీరసేకర బహిరంగంగానే విరుచుకుపడ్డారు.
దీనినిబట్టి శ్రీలంకలో చైనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విక్రమసింఘే, ప్రధాన మంత్రి దినేశ్ గుణవర్దన, చైనా సన్నిహితుడు మహింద రాజపక్సలతో సరత్ వీరసేకర లాబీయింగ్ చేశారు. దీంతో హంబంటోటా నౌకాశ్రయానికి ఈ గూఢచర్య నౌకకు అనుమతి లభించింది.
శ్రీలంకలోని దౌత్యవేత్తలు చెప్తున్నదాని ప్రకారం, పరిశోధనల సాకుతో హిందూ మహా సముద్ర ప్రాంతంలోకి వస్తున్న చైనీస్ గూఢచర్య నౌకలు గత దశాబ్దంలో బాగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసినా కనీసం మూడు నుంచి ఐదు గూఢచర్య నౌకలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి.  2020 నుండి 53 నౌకలు వచ్చాయి.

అటువంటి నౌకల విస్తరణ క్సీ జింగ్ పింగ్ పాలనకు సముద్రతీర దేశాలతో ఉమ్మడి సర్వేల రూపంలో సముద్ర దౌత్యం కోసం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మూడవ దేశం ప్రత్యేక ఆర్థిక జోన్‌లోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలకు అనుసంధానం డుతుంది. చైనా  గూఢచారి నౌకలు క్రింది ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది:

1. లోతైన సముద్రంలో అరుదైన భూమి ఖనిజాల కోసం నైంటీ డిగ్రీ ఈస్ట్ రిడ్జ్, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ (ఐ ఎస్ ఎ)తో అన్వేషణ హక్కుల కోసం దరఖాస్తు చేసుకునే చైనాకు పూర్వగామి కావచ్చు.

2. ఐ ఎస్ ఎ కేటాయించిన ప్రాంతాల్లో పాలీమెటాలిక్ సల్ఫైడ్‌లను తవ్వడం కోసం లోతైన సముద్ర అన్వేషణ కోసం సౌత్ వెస్ట్ ఇండియన్ రిడ్జ్.

3. పెట్రోలియం అన్వేషణ, సముద్ర నిఘా, హైడ్రోగ్రఫీ కోసం జియోలాజికల్ సర్వే కోసం పాకిస్తాన్, మయన్మార్ ఇఇజెడ్.

4. శ్రీలంక  ఇఇజెడ్, బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు మిగిలిన  సముద్రపు పడకల మ్యాపింగ్ కోసం, సోనార్ అప్లికేషన్లు మరియు నిఘా కోసం లవణీయతను పరీక్షించడం.

ఒక నిర్దిష్ట సమయంలో,  సగటున సుమారు 300 చైనీస్ ఫ్లాగ్డ్ వ్యాపారి నౌకలు, 200-300 చైనీస్ ఫిషింగ్ ఓడలు పనిచేస్తున్నాయి. పరిశోధనా నౌకలు అని పిలవబడేవి హైడ్రోలాజికల్ సర్వేలు, మెటల్ ప్రాస్పెక్టింగ్‌లను నిర్వహిస్తున్నాయని చెబుతున్నప్పటికీ, యువాన్ వాంగ్ 5 వంటి నౌకలు భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియాలపై దృష్టి సారించి ఈ ప్రాంతంలో ఉపగ్రహ కార్యకలాపాలు, క్షిపణి పరీక్ష ప్రయోగాలను పర్యవేక్షిస్తున్నాయి.