కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు బుధవారం జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఏడాది జూన్ నెలలోనూ ప్రియాంకా గాంధీ కరోనా బారిన పడ్డారు. తనకు రెండోసారి కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోంఐసోలేషన్ లో ఉన్నట్లు బుధవారం ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు.
ప్రియాంకా సోదరుడైన రాహుల్ గాంధీ కూడా అనారోగ్యానికి గురవడంతో అతను బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో జరగనున్న నేతృత్వ సంకల్ప శిబిరానికి హాజరు కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జూన్ నెలలో కరోనా బారిన పడ్డారు.
సోనియా గతంలో కరోనాకు చికిత్స కోసం ఢిల్లీల్లోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ హెడ్ పవన్ ఖేరా, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింగ్వీలకు కూడా కరోనా సోకింది. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కూడా మంగళవారం కరోనా సోకింది. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఖర్గే ట్వీట్ లో కోరారు.
మరోవంక, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 54 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 5,26,826 మంది మృతి చెందారు.
మరో 1,28,261 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 19,539 మంది బాధితులో వైరస్‌నుంచి బయటపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 207.03 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
More Stories
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు