17 ఏండ్లకే ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు 

ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి 18 ఏళ్ళ వయస్సు నిండేవరకు ఆగనవసరం లేదు. పదిహేడేండ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కరు ఓటర్ కార్డు కోసందరఖాస్తు  చేసుకోవచ్చని ప్రధాన ఎన్నికల​ కమిషనర్​ రాజీవ్​ కుమార్ (సీఈసీ), కమిషనర్​ అనూప్​ చంద్రపాండే ప్రకటించారు. అయితే 18 ఏండ్లు నిండిన తర్వాతే ఓటర్​ కార్డును జారీ చేస్తామని స్పష్టం చేశారు.
 
 ఇప్పటిదాకా 18 ఏండ్లు నిండినోళ్లు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే  ప్రతి ఏడాది జనవరి 1దాకా వేచి చూడాల్సి ఉండేదని గుర్తు చేశారు. ఈ నిర్ణయంతో ముందస్తుగానే ఓటర్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని వివరించారు. 17 ఏండ్లు ఉన్నప్పుడే ఓటర్​ కార్డు కోసం అప్లై చేసుకుంటే ఏడాది కలిసి వస్తుందని చెప్పారు. 
 
దీంతో పాటు ఎన్నికల చట్టంలో ఇంకిన్ని కీలక మార్పులు చేసినట్టు తెలిపారు. ఇకమీద జనవరి 1తో పాటు ఏప్రిల్​ 1,  జులై 1, అక్టోబర్​ 1 లను కూడా పరిగణలోకి తీసుకొని 18 ఏళ్ళ వయస్సు నిండినవారికి ఓటర్ కార్డులను జారీచేయనున్నట్లు వెల్లడించారు.   ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు, ఈఆర్‌‌‌‌వో.. ఏఈఆర్‌‌‌‌వోలకు రాజీవ్​ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. 
 
17 ఏండ్లు నిండినవారు ఎవరైనా ఎలక్షన్​ కార్డు కోసం అప్లై చేస్తే అంగీకరించాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన తరువాతే వారికి కార్డు జారీ చేయాలని చెప్పారు. 2023లో ఏప్రిల్‌‌‌‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌‌‌‌ 1 నాటికి 18 ఏండ్లు నిండే ప్రతీ ఒక్కరు ముందుగా  ఓటర్‌‌‌‌ కార్డు కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. 
 
ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫ్‌‌‌‌ ఎలక్టోర్స్ రూల్స్‌‌‌‌, చట్టాల్లో మార్పులు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రతీ 3 నెలలకోసారి కొత్త ఓటర్​ కార్డులతో పాటు కరెక్షన్​ చేసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు.  దరఖాస్తు ఫారాలు ఆగస్టు 1 తర్వాత అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అప్పటి వరకు పాత దరఖాస్తు ఫారాలతో దరఖాస్తు చేసినా అంగీకరిస్తామని తెలిపారు.