తెలంగాణాలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. మారిన రాజకీయ పరిణామాలే అందుకు కారణం కావచ్చని ఆమె చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేయటం వల్ల కేసీఆర్ లబ్దిపొందుతారని తాను అనుకోవటం లేదని ఆమె తెలిపారు.
జాతీయ రాజకీయాల కోసమే కేసీఆర్ ప్రధానిని టార్గెట్ చేసి ఉండొచ్చని ఆమె రు. అయితే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించడం అసాధ్యమని ఆమె ఓ సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్రపతిఓగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి వెళ్లిన గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరం బహిరంగ రహస్యమే అని చెప్పారు. ఇటీవల రాజ్ భవన్ లో కేసీఆర్ తనను కలిశారని, ఆ తర్వాత కూడా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆమె తెలిపారు.
వరదల సమయంలో కలెక్టర్ రావాల్సి ఉన్నా రాలేదని ఆమె గుర్తు చేశారు. గవర్నర్ అయినంత మాత్రాన రాజ్ భవన్ కే పరిమితం కానని డా తమిళసై స్పష్టం చేశారు. . ప్రజలకు దగ్గరగా ఉండడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజలు డబుల్ బెడ్ రూం ఇండ్ల గురించి ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.
“ఇతర రాష్ట్రాల గవర్నర్లతో నేను పోల్చుకోను. గవర్నర్‌ను కాబట్టి రాజ్‌భవన్‌కే పరిమితం కాను. ప్రజలకు అందుబాటులో ఉండటమే నా లక్ష్యం. నాకు తోచిన రీతిలో వారికి సాయం అందిస్తాను’’ అని ఆమె స్పష్టం చేశారు.
ముర్ము రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవం
కాగా, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ముకు తమిళిసై శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ముర్ము చాలా కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ, చాలా సాధారణ వ్యక్తి. ఆమె రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవం’ అని ఆమె గవర్నర్ పేర్కొన్నారు.
ప్రజల్లోకి వెళ్లిన విషయాలను ప్రస్తావిస్తూ వర్షాలు వచ్చాయి కాబట్టి వరద ప్రాంతాల్లో తిరిగానని గవర్నర్ తమిళిసై చెప్పారు. తాను రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల దగ్గరికి వెళ్లానని స్పష్టం చేశారు. వర్షాలకు ఎక్కువగా నష్టపోయిన ప్రాంతాలు ఆదివాసీలు ఉన్న ప్రాంతాలు కాబట్టి భద్రాచలం ప్రాంతంలో తిరిగిన్నట్లు తెలిపారు.
“నేను తెలుగు ప్రజల కోసం పనిచేస్తున్న….వర్షాలపై కేంద్రానికి నివేదికను ఇచ్చాను. వాళ్లు కేంద్ర బృందాలను పంపించారు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రానికి సహాయం చేస్తుంది..గతంలో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్షాల వల్ల ఎంత నష్టం జరిగిందో కేంద్రానికి ఇచ్చారు..’’ అని తమిళిసై వివరించారు.

More Stories
ప్రభుత్వ అసమర్ధతతోనే వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంటలు
ఆదివాసుల సమస్యలపై సెక్రటేరియట్ ముందు ధర్నా
మహిళా ఎమ్యెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించండి