టీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే

తెలంగాణాలో టీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని అంటూ కేసీఆర్‌ను ఎదురుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని తేల్చి చెప్పారు.  కొత్తగా వచ్చిన వాళ్ల కింద పనిచేయాలంటే ఇబ్బందేనని, జైలుకెళ్లి వచ్చిన వాళ్లు కూడా నీతులు చెప్తే ఎలా? అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని మూడేళ్ల క్రితమే తిరుపతిలో రాజగోపాల్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేయడం గమనార్హం.  గతవారం తాను ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ తాను కలసిన మాట నిజమే అని తెలిపారు.
అయితే, తాను ఆయనతో రాజకీయాల గురించి చర్చించలేదని అంటూనే తెలంగాణలోని పరిస్థితుల గురించి చర్చించినట్లు చెప్పుకొచ్చారు. తాను అమిత్ షాను కలవగానే  తాను బీజేపీలో చేరుతున్నట్లు వార్తలను ఈ సందర్భంగా కొట్టిపారేసారు.  ఆ విధమైన వార్తలను కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వాళ్ళే పుట్టిస్తున్నారని ఆరోపించారు.
అదే సమయంలో తాను పార్టీ మారడం చారిత్రక అవసరమని కూడా చెప్పడం గమనార్హం. పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి వెళ్తానని చెబుతూ ఇప్పుడు సమయం వచ్చింది అనుకుంటున్నానని పేర్కొన్నారు.  కేంద్రమంత్రి అమిత్‌షా తో రాజకీయాలపై మాట్లాడలేదని, తెలంగాణలోని పరిస్థితులపై అమిత్‌షాతో చర్చించానని తెలిపారు.
తాను ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు స్థానంకు ఉపఎన్నిక వస్తే, అక్కడ గెలుపొంది హుజురాబాద్ ఉపఎన్నికలలో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకనే తాను పార్టీ మారుతున్నట్లు తనపై కేసీఆరే దుష్ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
సెంబ్లీ సమావేశాలకు తప్ప ఇతర ఏ సందర్భంలోనూ కాంగ్రెస్‌ నేతలతో గత మూడేళ్ళుగా రాజగోపాల్‌ కలిసి రాలేదు. మరోవంక, వచ్చే నెల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడోవిడత పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో జరిగే బహిరంగసభలో అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నదని ఆయన మద్దతు దారులు భావిస్తున్నారు.
జులై ప్రారంభంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరిగిన బిజెపి బహిరంగసభలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరడం గమనార్హం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం కావడంతో వరంగల్ బహిరంగసభలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుండి ప్రముఖులు బీజేపీలో చేరేటట్లు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
మరోవంక, ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణాలో కాంగ్రెస్ అగ్రనాయకులైన జానారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ప్రతిష్టాకరం కావడంతో అటువంటి జిల్లాలో ఉపఎన్నికలో గెలుపొందడం ద్వారా తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ ను కాంగ్రెస్ ఓడించలేదని, తామే అనే స్పష్టమైన సందేశాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వడం కోసం బిజెపి చూస్తున్నట్లు చూస్తున్నది.