వినియోగదారుల హక్కులు కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే

దేశంలో వినియోగదారుల హక్కులకు భంగం కలుగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని, దేశ ప్రగతిలో వినియోగదారుడు ప్రధాన భూమిక కాబట్టి వారి హక్కులను కాపాడల్సిన  బాధ్యత ప్రభుత్వంపై ఉందని అఖిల భారతీయ గ్రహక్ పంచాయతీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి  నడిగి దత్తాత్రేయ స్పష్టం చేశారు. 

భాగ్యనగర్ (హైదరాబాద్) లోని కేశవ నిలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ వినియోగదారుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థ గ్రహాక్ పంచాయతీ అని తెలిపారు.  దేశం హితం కోసం ప్రజలకు జరుగుతున్న మోసాలపై వినియోగదారులను,  మేల్కొలిపి వారిని చైతన్యవంతులుగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

అదే విధంగా అనేక  కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకొనుటకు ప్రజలకు చేస్తున్న మోసాలపై  పోరాడడం సంస్థ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ గేమ్ ల ద్వారా కొన్ని సంస్థ లు కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకోవడం, ఓటిటి ప్లాట్ ఫామ్ లపై జరుగుతున్న మోసలపై ఇలా అనేక విషయాలపై ప్రజలను జాగృత పరిచి వినియోగదారుడి హక్కులను కాపాడడంలో గ్రాహక్ పంచాయతీ ముందు ఉన్నదని వివరించారు.

దేశం మొత్తం ఈ సంస్థ తమ కార్యకర్తల ద్వారా అనేక సెమినార్ లు వినియోగదారుల హక్కులపై జరపడం, మోసాలపై అధికారులకు పిర్యాదు చేయడం జరుగుతుందని దత్తాత్రేయ తెలిపారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.

భారతీయ గ్రాహక్ పంచాయత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బండి నరేష్, ఉపాధ్యక్షులుగా వినోద్ కుమార్ శ్రీవాత్సవ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  సంబు లక్ష్మణ స్వామి, కోశాధికారిగా మాణిక్ రావు, సంయుక్త కార్యదర్శిగా విజయ్, కార్యవర్గ సభ్యులుగా దూపాటి మట్టయ్య, కోటి రెడ్డి, శ్రీమతి ప్రద్యుమ్న, శ్రీమతి సుష్మాజి ఎన్నికయ్యారు.