బాంగ్లాదేశ్ లో మరోసారి ముస్లిం మతోన్మాదుల దుశ్చర్య 

బంగ్లాదేశ్‌లో మరోసారి ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోయారు. ఓ  ఫేస్‌బుక్  పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ, హిందూ దేవాలయంపైనా, హిందువుల ఇళ్ళపైనా, వారి షాప్ ల పైనా విచక్షణారహితంగా దాడులు చేసి, నిప్పు పెట్టారు.
గుంపులుగా దాడి చేసి, తొలుత రాళ్లు విసిరి, సహపర ఆలయంలోకి చొరబడి, ఆవరణలో ఉంచిన ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఫేస్‌బుక్ పోస్ట్‌ను ప్రచురించిన యువకుడి తండ్రికి చెందిన కిరాణా దుకాణంపై వారు దాడి చేసి ధ్వంసం చేశారు. ఆగ్రహానికి గురైన ముస్లిం గుంపు హిందూ యువకుడి ఇంటిని, చుట్టుపక్కల ఉన్న అనేక మంది ఇళ్లను ధ్వంసం చేసింది.

కోపోద్రిక్తులైన గుంపును చెదరగొట్టడానికి బాంగ్లాదేశ్ పోలీసులకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు, ఖాళీ షెల్స్‌ను ప్రయోగించారు. పరిస్థితిని  అదుపులోకి రావడానికి బంగ్లాదేశ్ పోలీసులకు అర్థరాత్రి వరకు పట్టింది.నివేదికల ప్రకారం, దాడి చేసిన వారిలో ఎవరిపైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. లేదా ఇస్మాలిస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

 
 అయినప్పటికీ, పోలీసులు హిందూ యువకుడి తండ్రిని సాయంత్రం తరువాత అతని ఇంటి నుండి అరెస్టు చేశారు. ఆ పోస్ట్ రాసిన సహపరాకు చెందిన అశోక్ సాహా కుమారుడు ఆకాష్ సాహా అనే యువకుడు ఆ ప్రాంతం నుండి పారిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిందని పోలీసులు తెలిపారు.
బాంగ్లాదేశ్ పోలీసు అధికారి హరన్ చంద్ర పౌల్ తెలిపిన వివరాల ప్రకారం, నరాయిల్ జిల్లా, డిఘోలియా గ్రామంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం మైనారిటీ హిందువుల దేవాలయం, ఇళ్ళపై ఇస్లామిస్టులు దాడులు చేశారు. ఓ హిందూ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని ఇస్లామిస్టులు ఆరోపించారు. ఓ హిందూ కుటుంబానికి చెందిన ఇంటిని తగులబెట్టారు.
దాడులకు పాల్పడుతున్న ఇస్లామిస్టులను చెదరగొట్టేందుకు గాలిలోకి కాల్పులు జరిపినట్లు హరన్ తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ ప్రబిర్ కుమార్ రాయ్ మాట్లాడుతూ, పరిస్థితిని అదుపులోకి తేవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ హింసాకాండకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
 బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తరచూ జరుగుతున్నాయి.  హాజీ సైఫుల్లా నాయకత్వంలో దాదాపు 200 మంది ఇస్లామిస్టులు మార్చి నెలలో ఢాకాలోని ఇస్కాన్ దేవాలయంపై దాడి చేశారు. దేవీ, దేవతల విగ్రహాలను అపవిత్రం చేసి,  ధ్వంసం చేశారు. దేవాలయం ప్రాంగణాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ దేవాలయంలో ఉన్న భక్తులపై కూడా దాడి చేశారు.
గత ఏప్రిల్ లో, బంగ్లాదేశ్‌లోని మున్షిగంజ్‌లో ఒక హిందూ ఉపాధ్యాయుడును సైన్స్ తరగతులలో ముహమ్మద్ ప్రవక్తను కించపరచడం, ఇస్లాంను అవమానించడం వంటి ఆరోపణలపై అనేక మంది విద్యార్థులు నిరసన వ్యక్తంచేయడంతో అరెస్టు చేశారు.  మున్షిగంజ్‌లోని బినోద్‌పూర్ రామ్ కుమార్ హైస్కూల్‌లో ఈ సంఘటన జరిగింది.
హృదయ్ చంద్ర మోండల్‌పై ఫిర్యాదు నందు చేసి, పోలీసులు చర్యలు తీసుకుని అరెస్టు చేశారు. మోండల్‌పై వచ్చిన ఆరోపణలతో సమాజం తమను వేధింపులకు గురిచేస్తోందని, బహిష్కరిస్తున్నారని మోండల్ కుటుంబం ఆరోపించింది. సామాజిక వేధింపుల కారణంగా అతని కుమారుడు కూడా పాఠశాలకు వెళ్లడం మానేశాడు.
 
గత ఏడాది, ఖురాన్‌ను అపవిత్రం చేశారని హిందూ సమాజాన్ని నిందిస్తూ, బంగ్లాదేశ్‌లోని ఇస్లాంవాదులు దుర్గాపూజ పండుగ సందర్భంగా విధ్వంసానికి పాల్పడ్డారు. వారు రామ్ ఠాకూర్ ఆశ్రమంపై దాడి చేశారు. మంగోలా, నబదుర్గా, బిజోయా, త్రిశూల్, కోట్‌బారి పూజా పండల్‌తో సహా 10 దేవాలయాలు, పూజా పండళ్లను ధ్వంసం చేశారు. నల్చిర, ఛాయానిబజార్, బేగంగోంజ్, చౌమోహోని, సోనైమూరిలో దాదాపు 20 ఇళ్లపై దాడులు జరిగాయి. అదే సమయంలో, నోఖాలిలోని చౌమోహోని వద్ద 9 ఆలయాలు, పూజా పండళ్లను ధ్వంసం చేశారు.