పారిశుధ్య కార్మికుల పట్ల సంవేదన శీలత లేకపోవడమే అసలు సమస్య

 సంవేదన శీలత లేకపోవడమే పారిశుధ్య కార్మికుల సమస్యలకు అసలు కారణం అని విశ్వహిందూ పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ తెలిపారు. “భారత్ లో శీవర్ మరణాలు” అనే విషయమై బి.ఎం.ఎస్, దత్తోపంత్ తెంగ్దే ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పారిశుధ్య కార్మికుల జాతీయ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేస్తూ పారిశుధ్య కార్మికుల సమస్యలు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు డ్రైలెట్రిన్ లు ఉండేవని, కొందరు కార్మికులు తల పైకి ఎత్తుకొని దూరంగా ఈ మాలిన్యాన్ని పోస్తూ ఉండేవారని ఆయన గుర్తు చేశారు. ఈ అమానవీయ పనినీ ప్రభుత్వం నిషేధించిందని చెబుతూ నగరాలలో మల,మూత్రాలతో కూడిన కాల్వల(శీవర్)లో ప్రవాహం ఆగిపోతే పారిశుధ్య కార్మికులు,శరీరం పై యే అచ్చాదనా లేకుండా లోపలికి దిగి ఆ మాలిన్యాన్ని బయటకు ఎత్తి పోస్తుంటే అతని తలపై పడడం ఇప్పటికీ చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ పనిచేస్తూ విష వాయువుల వల్ల,అనేక ఇతర కారణాల వల్ల అన్ని రాష్ట్రాలలో అనేక మంది మరణిస్తున్నారని చెబుతూ  1993 నుండి 28 ఫిబ్రవరి 2022 వరకు 989 మంది మరణించారని వెల్లడించారు. 2021-22 లోనే 78 మంది మరణించారని, 2022 జనవరి నుండి నేటి వరకు 42 మంది మరణించారని తెలిపారు. ఇవి అధికార పూర్వక లెక్కలు మాత్రమే అని, వెలుగు చూడని మరణాలు ఎన్నో అని ఆయన చెప్పారు.
ఈ మరణాలు అన్ని రాష్ట్రాలలో జరిగాయని అంటూ దేశ రాజధాని ఢిల్లీలో కూడా జరగడం మరింత దుఃఖకరం అని  స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇటువంటి  మరణాలు ధనవంతుల కాలనీల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జరుగుతున్నాయని అలోక్ జి తెలిపారు. ఈ సమస్యల పట్ల బాధ ఎవరికీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
`హిందవః సోదరాః సర్వే’ అనే మంత్రానికి కార్యాచరణ ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు చేసిన మాలిన్యాన్ని తోలగించడంలో వారు మన వ్యవస్థ లోపాల వల్ల మరణిస్తున్నారని అంటూ 2014 లో ఇలా మరణించిన వారికి రు.10 లక్షలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన   తీర్పు లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు. ఈ పరిహారం ఎవరు చెల్లించాలి? స్పష్టత లేదని తెలిపారు.
 
ఢిల్లీలో ఒక ఘటనలో ఇద్దరు మరణించగా, మూడవ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నా అతను మరణించలేదని ఈ పరిహారం అతనికి ఇవ్వలేదని అలోక్ జి తెలిపారు. మార్చ్ 2022 లో మహారాష్ట్రలో పుణె, కొల్హాపూర్ లలో దుర్ఘటనలు జరిగాయని అంటూ కొల్హాపూర్ లో మరణించిన కుటుంబాలకు పరిహారం లభించింది గాని, పూణే లో ఎవరు చెల్లించాలి అనే మీమాంస పై పరిహారం చేళ్ళించలేదని ఆయన పేర్కొన్నారు. 
 
 ఈ 10 లక్షల ను బ్యాంక్ లో వేస్తే నెలకు రు.6,500  వడ్డీగా వస్తుందని అంటూ ఈ ఆదాయంతో భర్తను కోల్పోయిన ఆమె పిల్లల్తో ఎలా జివించగలదు? అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిహార మొత్తాన్ని  పెంచాలని స్పష్టం చేశారు. 
 
 నియమాలు పాటించకుండా బలవంతం చేసి,త్రాగించి సీవర్లో కు కాంట్రాక్టర్ దింపితే, ఆ పారిశుధ్య కార్మికుడు మరణిస్తే ఆ కాంట్రాక్టరుపై హత్యారోపణ కేసును నమోదు చేయాలని సూచించారు. ఈ కాంట్రాక్టర్ ను నియమించిన ఆ మున్సిపాలిటి ఆ రూ 10 లక్షలను చెల్లించాలని స్పష్టం చేశారు. 
 
“మోటార్ వెహికల్ ఆక్ట్ వల మరణించిన కుటుంబానికి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా పరిహారం చెల్లించాలి.ఒక మానవుడు (పారిశుధ్య కార్మికుడు) తోటి మానవుల మల మూత్రాల కాలువలోకి దిగవల్సి రావడం అమానవీయం. ఈ మరణాలకు ముగింపు పలకాలి.అవసరమైన యాంత్రీకరణను చేపట్టాలి” అని అలోక్ జీ డిమాండ్ చేశారు. 
 
తప్పనిసరి అయి దిగవలసి వస్తే అన్ని రక్షణలు, దుస్తులతో దింపాలని అంటూ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాలకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలందరికీ సంవేదన శీలతను కల్పించాలని  ఆలోక్ జీ లో పేర్కొన్నారు. 
సదస్సుకు బి.ఎం.ఎస్. జాతీయ ఉపాధ్యక్షులు డిక్కీ,పంజాబ్అ ధ్యక్షత వహించారు. సదస్సు లక్ష్యాలను బి. ఎం.ఎస్.
జాతీయ సంఘటనా కార్యదర్శి బి సురేంద్రన్ వివరించారు రెండు,మూడు సమావేశాలలో మాజీ చైర్మన్ సఫాయి కర్మచారి కమీషన్  మాజీ చైర్మన్ వెంకటేషన్, మాజీ సభ్యురాలు  శ్రీమతి అంజనా పన్వార్,  స్వాస్త్య కర్మచారి మహా సంఘ్ టన్ జాతీయ అధ్యక్షుడు రాజేష్ మాండలిక, గిరెంద్రనాధ్, న్యాయవాది, ఓం ప్రకాష్ జీ( డిల్లీ జల బోర్డ్), ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ శర్మ వివిధ సమస్యలను సదస్సు దృష్టికి తీసుకు వచ్చారు.
వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మిక ప్రతినిధులు,సమరసత కార్యకర్తలు పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రసంగించారు.  11 రాష్ట్రాల నుండి కార్మిక ప్రతిని ధులు,సామాజిక కార్యకర్తలు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులను తోటి మానవులుగా గౌరవించాలి 
 
మన వీధిని రోజూ శుభ్రం చేసే పారిశుధ్య కార్మికునికి దాహం వేస్తే ఒక గ్లాస్ నీరు ఇవ్వడానికి మన తయారుగా లేమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నాడు పారిశుధ్య కార్మికులను తోటి మానవులుగా గౌరవించడం మనం ముందు నేర్చుకోవాలని సామజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు.  ముగింపు ప్రసంగం చేస్తూ అందుకే సామాజిక సమరసత వేదిక దేశ వ్యాప్తంగా 125 జిల్లాలో పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి సమస్యలను ప్రజలు వినేట్లు కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.
ఈ సంవత్సరం మిగిలిన అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తుందని  పారిశుధ్య కార్మికుల పట్ల ప్రజలు గౌరవ భావంతో వ్యవహరించేట్లు బాధ్యత వహిస్తుందని చెప్పారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లలో సామాజిక సమరసత వేదిక సర్వే నిర్వహించిందని, ఈ కుటుంబాల పిల్లలకు చదువులో,కుటుంబ సభ్యులకు ఆరోగ్యం. విషయంలో సహకరించే యోజన చేస్తుందని ఆయన వివరించారు.
వీరి సమస్యల పరిష్కారం కోసం బి.ఎం.ఎస్.ముందుకు రావడం సంతోషకరం అని అభినందించారు. ప్రజలందరి మధ్య బంధు భావన నిర్మాణం కొరకు సామాజిక సమరసత పని చేస్తుందని చెప్పారు.
సదస్సు డిమాండ్లు 
1. పారిశుధ్య కార్మికుల సమస్యలు ఇతర ఎస్సీల సమస్యలతో పోలిస్తే బిన్నమైనవి. జాతీయ ఎస్సీ.,కమిషన్ ద్వారా ఈ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కావు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ ను కొనసాగించాలి.
2. జాతీయ సఫాయి కమీషన్ కు రాజ్యాంగ భద్దమైన గుర్తింపు,హక్కులు కల్పించాలి.
3. ఇప్పటికీ 7 రాష్ట్రాలలో మాత్రమే సఫాయి కర్మచారి కమీషన్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో ఈ కమీషన్లను ఏర్పరచాలి.
4. అన్ని రాష్ట్రాలలో సీవర్ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆధునిక యుగంలో మానవులు. (పారిశుధ్య కార్మికులు) తోటి మానవుల మల మూత్ర ముల కాలువలోకి దిగవలసిన పరిస్తితి కల్పించడం మానవత్వానికి మాయని మచ్చ.వీటిని అరికట్టడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో యాంత్రీకరణ (mechanisation)ను చేపట్టాలి.
5. అనేక చోట్ల నియమాలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు ఎలాంటి రక్షణ సాధనాలు లేకుండా,అనుభవం లేని వ్యక్తులను శరీరం ఎలాంటి ఆచ్చాదన లేకుండా సీవర్ లోకి దింపడం ఈ మరణాలకు ప్రధాన కారణం.
 
6. 2014లో సుప్రీం కోర్టు సీవర్ లో మరణించిన వారికి రు.10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే సేవర్ మరణం పొందిన వారికి ఈ రొక్కం అందింది.ఈ తీర్పులో అనేక లోపాలు ఉన్నాయి.రు.10 లక్షలు ఎవరు ఇవ్వాలో తీర్పులో స్పష్టత లేదు.సీవర్ లో దిగడం వల్ల తీవ్ర అశ్వస్తకు గురైనా,నడుం విరిగి పని చేయలేని దుస్తితి కల్గిన ఈ తీర్పు వల్ల ఏమి సహాయం అందడం లేదు.ఈ లోపాలను సవరించాలి.కొన్ని మరణాలు వెల్గు చూడడం లేదు.
7) సీవర్ నుండి విష వాయువులు వస్తాయి.మూత తొలగించిన చాలా సమయం తర్వాత విషవాయువులు రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాతే సీవర్ లోకి తగు భద్రతా దుస్తులు, పరికరాలతో దిగాలి. ఇవేమీ నియమాలు పాటించకుండా బలవంతంగా సీవర్ లోకి కాంట్రాక్టరు దింపడం వల్ల పారిశుధ్య కార్మికులు మరణిస్తే ఆ కార్మికుల మరణంకు కాంట్రాక్టరును బాధ్యుని చేస్తూ అతనిపై హత్య కేసును నమోదు చేయాలి.రు.10 లక్షలు ఆ మున్సిపాలిటీ చెల్లించాలి.ఈ చట్టంకు మోటారు వెహికల్ చట్టంను జోడించాలి.
8. అందరి పారిశుధ్య కార్మికుల లకు,వారి కుటుంబ సభ్యులకు నిర్ణీత వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
9. సీవర్లోకి దిగే పారిశుధ్య కార్మికులకు,కాంట్రాక్టర్లకు నిర్ణీత వ్యవధిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన తరగతులను నిర్వహించాలి.