ఎస్‌బీఐ పేరుతో కిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లు జాగ్రత్త!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్‌ చేశారని మరో ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోందని ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను వేరేవాళ్లతో పంచుకోవద్దని వెల్లడించింది.

నిజంగా  ఎస్‌బీఐ  పంపినట్టుగానే ఒక ఫేక్  ఎస్‌ఎంఎస్‌   కొందరు కస్టమర్లకు వచ్చిందని, కానీ ఆ  ఎస్‌ఎంఎస్‌  ను ఎస్‌బీఐ పంపలేదని.. కొందరు సైబర్ నేరగాళ్ల పనిగా పేర్కొంది. ఇలాంటి ఫేక్ ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్ విషయంలో కస్టమర్లు ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం హెచ్చరించింది. 

తొందరపడి అటువంటి నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లకు  స్పందిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. అంతేకాదు. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాల విషయంలో గోప్యత పాటించాలని, షేర్  చేయవద్దని సూచించింది.

ఎస్‌బీఐ కస్టమర్లకుమీ పత్రాలు కాలం చెల్లడంతో ఖాతా ఆపివేయడం జరిగినదని అంటూ ఓ సైట్ చిరునామా ఇచ్చి క్లిక్ చేయమని  ఎస్‌ఎంఎస్‌   వస్తే మాత్రం అస్సలు స్పందించకండి. ఈ  ఎస్‌ఎంఎస్‌   ఒకవేళ  ఎస్‌బీఐ   కస్టమర్లలో ఎవరికైనా వస్తే తక్షణమే report.phishing@sbi.co.inలో రిపోర్ట్ చేయాల్సిందిగా పిఐబి  పేర్కొంది.

ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు ప్రచారంలోకి రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఆర్ బి ఐ నోర్మ్స్  పాటించకపోవడం వల్ల మీ అకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నామని కొందరు ఎస్‌బీఐ కస్టమర్లకు కొంతకాలంగా నకిలీ ఎస్‌ఎంఎస్‌ లు వస్తున్నాయి. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో ఈ హెచ్చరికను షేర్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులెవరూ నకిలీ సందేశాలతో వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని ఎస్‌బీఐ అప్రమత్తం చేసింది.