పెట్రోల్ పన్ను తగ్గింపు భారం కేంద్రమే భరిస్తుంది

పెట్రోల్ పన్ను తగ్గింపు భారం మొత్తం కేంద్రమే భరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. శనివారం ప్రకటించిన పెట్రోల్‌, డీజిల్‌పై సుంకం తగ్గింపు మొత్తం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే పనుులలోనిరోడ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ (ఆర్‌ఐసి) కాంపోనెంట్‌కు వెలుపల జరిగిందని ఆమె  తెలిపారు.
ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు కారణంగా రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆమె తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై విధించే రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్‌కు పన్నుల కోత వర్తిస్తుందని చెబుతూ ఈ సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు కాబట్టి  ఆ మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు.
 పెట్రో ఉత్పత్తులపై ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకానికి సంబంధించి ఎటువంటి మార్పు ఉండదని ఆమె చెప్పారు. కాగా, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యూపీఏ ప్రభుత్వం కంటే మోదీ ప్రభుత్వం చాలా ఎక్కువ కేటాయింపులు చేసిందని ఆమె వివరించారు. 
 
గడచిన ఎనిమిదేళ్లలో కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలపై రూ.90.9లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆమె తెలిపారు. యూపీఏ పాలించిన పదేళ్ల (2004-14) కాలంలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ.49.2లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆమె చెప్పారు. ఇవన్నీ ఆర్‌బీఐ చెబుతున్న గణాంకాలేనని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. తద్వారా ప్రస్తుత ధరలను ఆమె పరోక్షంగా సమర్థించుకున్నారు.
కాగా,  పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం వల్ల ఏర్పడిన ఆదాయ నష్టానిు భర్తీ చేసుకుంటామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం అదనపు రుణం కోసం ప్రయత్నిస్తోంది. పెట్రో ధరలు తగ్గించడం వల్ల 12.9 బిలియన్‌ డాలర్లు ఆదాయానిు కోల్పోతున్నట్లు కేంద్రం చెబుతోంది.